Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్
ప్రముఖ నటి కీర్తి సురేష్ ఇటీవలే వైవాహిక జీవితంలోకి ప్రవేశించింది. తాజాగా కీర్తి తన ప్రేమ కథ, ఆంటోనీ థాటిల్‌తో వివాహం గురించి వివరాలను పంచుకుంది. తాను 12వ తరగతి చదువుతున్నప్పుడే తమ రిలేషన్‌షిప్ ప్రారంభమైందని, 2010లో ఆంటోనీ తనకు ఇచ్చిన ఛాలెంజ్‌తో ప్రపోజ్ చేశాడని వెల్లడించింది.
"మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాము" అని కీర్తి చెప్పింది. ఆంటోనీ తనకు 2016లో ప్రామిస్ రింగ్ ఇచ్చాడని, తమ బంధాన్ని మరింత బలపరిచిందని తెలిపింది. ఆమె తన వివాహం వరకు ఆ ఉంగరాన్ని ధరించింది. ఆమె అనేక చిత్రాలలో కూడా ఇది కనిపిస్తుంది.
ఎంతో కాలంగా తాము ఊహించుకున్న క్షణమే తమ పెళ్లి కల సాకారమైందని కీర్తి తెలిపింది. ఆంటోనీ తన కంటే ఏడేళ్లు పెద్దవాడని, గత ఆరేళ్లుగా ఖతార్‌లో పనిచేస్తున్నాడని ఆమె వెల్లడించింది. "ఆంటోని నా జీవిత భాగస్వామిగా ఉండటం నా అదృష్టం" అని పేర్కొంది.
సమంత, విజయ్, అట్లీ, ప్రియా, ప్రియదర్శన్, ఐశ్వర్య లక్ష్మితో సహా సినీ పరిశ్రమలోని కొంతమందికి మాత్రమే తమ సంబంధం గురించి తెలుసునని నటి పేర్కొంది.