శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (15:38 IST)

నడి రోడ్డుపై అకాలీదళ విద్యార్థి నేత దారుణ హత్య

పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నడి రోడ్డులో అకాలీదళ నేతను దారుణంగా హత్య చేశారు. పంజాబ్‌లోని మొహాలీలో శ‌నివారం మ‌ధ్యాహ్నం దారుణం జ‌రిగింది. విక్కీ మిద్దుఖేర‌గా గుర్తించారు. ఈయన్ను గుర్తు తెలియ‌ని దుండ‌గులు కాల్చిచంపారు. 
 
ఈ ఘ‌ట‌న‌పై మొహాలీ ఎస్పీ స‌తీంద‌ర్ సింగ్ స్పందించారు. మ‌తౌర్ మార్కెట్‌కు వ‌చ్చిన విక్కీ కారులో తిరుగు పయ‌నం అవుతుండ‌గా దుండ‌గులు అతినిపై కాల్పులు జ‌రిపారు. అప్ర‌మ‌త్త‌మైన విక్కీ కారు దిగి పారిపోయేందుకు య‌త్నించాడు. 
 
దాదాపు అర కిలోమీట‌రు మేరకు విక్కీ ప‌రుగు పెట్టాడు. ఈ క్ర‌మంలో విక్కీని వెంటాడి కాల్పులు జ‌రిపి చంపేసినట్టు తెలిపారు. విక్కీపై 8 నుంచి 9 రౌండ్ల కాల్పులు జ‌రిపారని తెలిపారు. విక్కీ హ‌త్య‌పై విచార‌ణ కొన‌సాగుతోంద‌ని తెలిపారు. మొత్తం నలుగురు దుండగులు ఇందులో పాల్గొన్నట్టు తెలిపారు.