శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By
Last Updated : బుధవారం, 10 అక్టోబరు 2018 (11:21 IST)

నవరాత్రి ఉత్సవాలు.. తొలిరోజున శైలిపుత్రిని మల్లెలతో పూజిస్తే..?

నవరాత్రి పర్వదినాల్లో తొలిరోజైన బుధవారం (అక్టోబర్ 10 2018) శైలపుత్రిని కొలవాలి. పర్వత రాజు కుమార్తె అయిన శైలపుత్రిని నవరాత్రుల్లో తొలిరోజున పూజిస్తే.. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

నవరాత్రి పర్వదినాల్లో తొలిరోజైన బుధవారం (అక్టోబర్ 10 2018) శైలపుత్రిని కొలవాలి. పర్వత రాజు కుమార్తె అయిన శైలపుత్రిని నవరాత్రుల్లో తొలిరోజున పూజిస్తే.. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. నవగ్రహాల్లో చంద్రుడికి ఆధిపత్యం వహించే ఈమె.. దుష్టశక్తులను హతమార్చుతుంది. దక్షుని యజ్ఞగుండంలోకి ప్రవేశించి.. హిమవంతునికి కుమారిగా జన్మించి.. పరమేశ్వరుడిని పెళ్లాడినట్లు పురాణాలు చెప్తున్నాయి. 
 
కఠోర తపస్సు కారణంగా అస్థిపంజరంగా మారిన అమ్మవారికి గంగతో శుద్ధి చేసి.. ఆమెను పత్నీగా పరమేశ్వరుడు స్వీకరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అలాంటి అమ్మవారిని మల్లెలలతో పూజించాలి. వినాయకునికి స్తుతించి షోడశోపచార పూజతో హారతి ఇవ్వాలి. ఇలా శైలపుత్రిని పూజించడం ద్వారా చంద్ర గ్రహ దోషాలు తొలగిపోతాయని.. మనోవాంఛ సిద్ధిస్తుందని విశ్వాసం. 
 
ఇకపోతే.. బుధవారం బెజవాడ అమ్మవారు స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు. రాత్రి 11 గంటల వరకూ అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాలు జరిగే 9 రోజులూ నిత్యమూ లక్ష కుంకుమార్చన, చండీయాగాలు జరుగుతాయని, రెండుపూటలా అన్న ప్రసాద వితరణ ఉంటుందని అధికారులు తెలిపారు.
 
ఇక 11న అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా, 12న గాయత్రీ దేవిగా, 13న లలితా త్రిపుర సుందరీ దేవిగా, 14న మూలా నక్షత్రం నాడు సరస్వతీ దేవిగా, 15న అన్నపూర్ణగా, 16న మహాలక్ష్మిగా, 17న దుర్గాదేవిగా, 18న మహిషాసురమర్ధనిగా, రాజరాజేశ్వరిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు.