Biodata Maker
✕

చికెన్ లాలీ పాప్స్... మీరే తయారు చేయొచ్చు టేస్టీగా...

చికెన్ లాలీ పాప్స్ చాలామంది ఏదో హోటల్లో కొనుక్కుంటారు కానీ అవి మనమే చేసుకుంటే ఆ టేస్టే వేరు. ఇంతకీ వాటిని ఎవా తయారు చేయాలో చూద్దాం. కావల్సినవి... చికెన్ కీమా 3 కప్పులు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 1, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మసాలా అర టేబుల్ స్పూన్

Written By chj
Updated: సోమవారం, 11 సెప్టెంబరు 2017 (18:12 IST)
చికెన్ లాలీ పాప్స్ చాలామంది ఏదో హోటల్లో కొనుక్కుంటారు కానీ అవి మనమే చేసుకుంటే ఆ టేస్టే వేరు. ఇంతకీ వాటిని ఎవా తయారు చేయాలో చూద్దాం. కావల్సినవి... చికెన్ కీమా 3 కప్పులు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 1, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మసాలా అర టేబుల్ స్పూన్, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్, ఫిస్ సాస్ 2 టేబుల్ స్పూన్స్, టమోటా సాస్ 4 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర 2 రెమ్మలు, గుడ్లు 2(పచ్చసొన మాత్రమే). మొక్కజొన్న పిండి పావుకప్పు, మైదా పిండి పావుకప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, హాట్ వాటర్ వేడి చేసుకునేందుకు సరిపడినంత...
 
తయారీ... ముందుగా చికెన్ కీమాను మిక్సీ చేసుకోవాలి. తర్వాత మసాలా, సోయా సాస్, ఫిష్ సాస్, టమోటా సాస్ కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర అల్లం పేస్టు లేదా అల్లం ముక్క వేసుకుని మరోసారి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో ఆ మిశ్రమాన్ని తీసుకుని అందులో గుడ్డు యాడ్ చేసుకుని బాగా కలపాలి. తర్వాత అందులో మొక్కజొన్న పిండి, మైదా పిండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. 
 
ఇప్పుడు ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ తీసుకుని అందులో ఈ మొత్తం మిశ్రమాన్ని వేసుకుని పొడవుగా చుట్టుకుని చాక్లెట్లా రెండు చివర్లలో మెలిపెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని మరుగుతున్న నీట్లో వేసుకుని పది నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత సిల్వర్ ఫాయిల్ పేపర్ నుంచి చికెన్ బన్‌ను బయటకు తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే రుచికరమైన చికెన్ లాలీ పప్స్ సిద్ధమవుతాయి.

అన్నీ చూడండి

పబ్ వ్యవహారం.. సీఎం చంద్రబాబు సీరియస్.. అభ్యంతరకరమైన భాష.. ఐఏఎస్ బదిలీ

ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలి 'మత్తు' మార్గం

అలా చేస్తే బీసీ రిజర్వేషన్ వర్తించదు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఉదయం పెళ్లితో ఒక్కటయ్యారు.. సాయంత్రం రిసెప్షన్‌లో విడిపోయిన ప్రేమ జంట.. ఎందుకు?

NDA Alliance- ఎన్నికలు.. సీట్ల పంపకాన్ని ఖరారు చేసిన ఏపీ ఎన్డీఏ కూటమి

అన్నీ చూడండి

Jailer 2 Review: రజనీ జైలర్ ను కొనసాగిస్తూ బేలన్స్ చేసి మెప్పించిన జైలర్ 2 మూవీ రివ్యూ

Rashmika Mandanna: హైదరాబాద్ టు బెంగుళూరు 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక మందన్నా

RC 17 Update: నేడు ఆర్.సి.17 సినిమా ఆఫీస్ ప్రారంభం - ఈనెల 25న పూజతో షూటింగ్ ప్రారంభం !

T. Gopichand :టి. గోపీచంద్ చిత్రం భరతవర్ష నుంచి నవదుర్గల వైభవాన్ని చాటిచెప్పే సాంగ్ రిలీజ్

Imanvi Ismail : ఫౌజీ సెట్‌లో ఇమాన్వికి భారీ ఇంటి విందుతో ప్రభాస్ సర్‌ప్రైజ్

తర్వాతి కథనం
Show comments