కాశ్మీరీ మటన్ ఘోస్ట్‌ను ఎలా తయారు చేస్తారు?

మేక మాంసాన్ని శుభ్రంగా కడిగి, జీడిపప్పు ముద్ద, పెరుగు కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో నూనె వేసి కాగిన తరువాత యాలక్కాయల పొడి, జాపత్రి, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాల

శనివారం, 3 సెప్టెంబరు 2016 (11:21 IST)
కావలసిన పదార్థాలు :
ఎముకలు లేని మేక మాంసం... అరకేజీ
పెరుగు... ఒక కప్పు
యాలక్కాయలపొడి... తగినంత
జాపత్రి... తగినంత
దాల్చిన చెక్క... చిన్న సైజువి రెండు
జీడిపప్పు... వంద గ్రా. (పేస్టు చేయాలి)
అల్లం వెల్లుల్లి ముద్ద... సరిపడా
నూనె... సరిపడా
మీగడ... తగినంత
 
తయారీ విధానం :
మేక మాంసాన్ని శుభ్రంగా కడిగి, జీడిపప్పు ముద్ద, పెరుగు కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో నూనె వేసి కాగిన తరువాత యాలక్కాయల పొడి, జాపత్రి, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. 
 
కాసేపలా వేగిన తరువాత మీగడ, ఉడికించిన మేకమాంసం కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి మాంసం మెత్తగా ఉడికి, కూర దగ్గర పడుతుండగా దించేయాలి. అంతే.. ఘుమఘుమలాడే కాశ్మీరీ ఘోస్ట్ తయారైనట్లే..! ఇది వేడి వేడి అన్నం, చపాతీ, పరోటా, దోసెలతోపాటు తింటే చాలా రుచిగా ఉంటుంది. 

అన్నీ చూడండి

ఆంధ్ర ప్రజలకు హెచ్చరిక, ఆ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు, జాగ్రత్త

Annamalai: బీజేపీకి బైబై చెప్పనున్న అన్నామలై

పవన్ కళ్యాణ్ జనసేన సమావేశానికి పోలీసుల అనుమతి నిరాకరణ

రాజ్యసభకు వైఎస్ షర్మిల నామినేషన్ ఖరారు

27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

అన్నీ చూడండి

Shalini: సింగ్ గీతం లో విలన్ క్యారెక్టర్ చేశాను. మాటే పాటగా మారే కథ ఇది : శాలిని కొండెపుడి

Sunitha: భానుచందర్, సునీత, సి కళ్యాణ్ ఆవిష్కరించిన కొత్త మలుపు ట్రైలర్

SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి మ్యూజిక్ కు వరల్డ్ రికార్డ్ గుర్తింపు దక్కింది

Janhvi Kapoor : సినిమా అనేది ప్రజలకు చేసే సేవ : జాన్వీ కపూర్

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ చిత్రం ఇరుముడి గ్లింప్స్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments