Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింటర్‌లో మిర్చి ఘాటుతో వెరైటీ చికెన్ గ్రేవీ..

ముందుగా ఎండుమిర్చిని నీళ్లలో వేసుకుని ఉడికించి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. చికెన్ ముక్కల్ని నూనెలో వేయించుకుని తీసుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి అందులో ఆవనూనె వేసి వేడి చేయాలి. నూనెలో ఎండుమిర్చి పేస్

Written By Selvi
Updated: మంగళవారం, 24 జనవరి 2017 (17:20 IST)
అసలే వింటర్. వేడి వేడి సూప్స్, స్నాక్ మీద మనస్సు మళ్లుతుంది. ఇలాంటి సమయంలో శరీరానికి వేడినిచ్చే చికెన్‌తో.. శరీరంలోని బ్యాక్టీరియాను నశింపజేసే మిర్చి కాంబోలో వెరైటీ చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
చికెన్ - అర కేజీ 
ఎండు మిర్చి - ఆరు 
ఆవనూనె - నాలుగు టేబుల్ స్పూన్లు 
దాల్చిన చెక్క- రెండు ముక్కలు 
ఏలకులు - ఐదు
శొంఠి పొడి- అర టీ స్పూన్ 
సోంపు పొడి- టేబుల్ స్పూన్ 
కారం- చెంచా
పసుపు- అర చెంచా 
ఉప్పు - తగినంత 
నూనె, నీరు - తగినంత 
 
తయారీ విధానం: ముందుగా ఎండుమిర్చిని నీళ్లలో వేసుకుని ఉడికించి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. చికెన్ ముక్కల్ని నూనెలో వేయించుకుని తీసుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి అందులో ఆవనూనె వేసి వేడి చేయాలి. నూనెలో ఎండుమిర్చి పేస్ట్, కారం వేసుకోవాలి. నిమిషం తర్వాత నీళ్లు పోసి.. అందులో చికెన్ తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి దోరగా వేపాలి. అన్నీ బాగా వేగాక.. చికెన్ ముక్కలు తగినంత నీరు పోసుకోవాలి. నీరు సగం అయ్యాక చికెన్ గ్రేవీలా అయ్యేంత వరకు ఉంచి దించేస్తే సరిపోతుంది. ఈ చికెన్ కూరను వేడి వేడి అన్నంలోకి లేదా రోటీల్లోకి తీసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.

అన్నీ చూడండి

నేపాల్ ఫ్లాష్ ప్లడ్‌కి కారణం హిమ గిరుల్లో 4.4 తీవ్రతో ఏర్పడిన భూకంపమే, ఐసు కొండ బద్ధలైంది

ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు: లుమారాతో యాక్సిస్ ఎనర్జీ భాగస్వామ్యం

యువత ఆకాంక్షలే తెలంగాణ కొత్త గృహ కొనుగోలుదారుల చోదక శక్తులు: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్

మా కైలాష్ యాత్ర బృందాలలో ఒకటి నేపాల్ వరదల్లో చిక్కుకుంది, వారి ఆచూకి అందలేదు: సద్గురు జగ్గీ వాసుదేవ్

సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026: కోకా-కోలా బెవరేజెస్ బృందంతో ఏపీ మంత్రి టి.జి. భరత్

అన్నీ చూడండి

Prakash Raj: డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్ సినిమా ఫాదర్ టీజర్ రిలీజ్

king 100: నాగార్జున పుట్టినరోజు న కింగ్ 100 మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

Mandadi teaser: విజువల్స్, బోట్ సీక్వెన్స్ తో సుహాస్, సూరి ల మండాడి టీజర్

Taapsee Pannu : అప్పుడే మేము దానిని వేడుకలా జరుపుకుంటాం : తాప్సీ పన్ను

ప్రియదర్శి.. ఇడుపు కాయితం నుంచి శ్రీలత సాంగ్ ప్రోమో రిలీజ్

తర్వాతి కథనం
Show comments