Daily Horoscope
✕

నాట్స్ ఆధ్వర్యంలో హైవే దత్తత కార్యక్రమం, సామాజిక సేవలో తెలుగు విద్యార్ధులు

Written By ఐవీఆర్
Updated: గురువారం, 23 ఏప్రియల్ 2026 (14:55 IST)
సామాజిక బాధ్యతను తెలుగు విద్యార్ధుల్లో పెంచేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా  స్థానిక ఈస్ట్ విండ్సర్ నగరంలో చేపట్టిన హైవే దత్తత సామాజిక స్పృహను చాటిచెప్పింది. పర్యావరణ పరిరక్షణను ఒక యజ్ఞంలా భావించి గతంలో పలు నగరాల్లో విజయవంతంగా సేవలు అందించిన నాట్స్, అదే స్ఫూర్తితో ఈసారి న్యూజెర్సీలో ఈస్ట్ విండ్సర్ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను భుజాన వేసుకుంది.
 
ఈ పారిశుధ్య కార్యక్రమంలో చిన్నారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. సమాజం పట్ల బాధ్యతను చిన్నతనం నుంచే అలవరుచుకోవాలనే సంకల్పంతో, రహదారి పరిసరాల్లోని వ్యర్థాలను తొలగించి తమ వంతు తోడ్పాటును అందించారు. సమాజ హితం కోసం పిల్లలు చూపిన ఈ చొరవ పెద్దలను సైతం ఆలోచింపజేసింది.
 
విద్యార్థులు చిన్ననాడే ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం వల్ల వారిలో క్రమశిక్షణ, సామాజిక స్పృహ పెరుగుతాయని  నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి అన్నారు.. పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని, ఇలాంటి పనులు విద్యార్థుల భవిష్యత్తుకు మరియు వారి విద్యా సంబంధిత సేవా గుర్తింపునకు ఎంతో తోడ్పడతాయని ఆయన వివరించారు.
 
ఈ కార్యక్రమంలో నాట్స్ కార్యవర్గ సభ్యులు, ఇతర ప్రతినిధులు పాల్గొని పనులను పర్యవేక్షించారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో సామాజిక హితమే లక్ష్యంగా నాట్స్ నిరంతరం కృషి చేస్తోందని నాట్స్ నాయకులు తెలిపారు. నాట్స్ ఎడాప్ట్ ఎ హైవేలో పాల్గొన్న వారందరిని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల అభినందించారు.
About Author
ఐవీఆర్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... Read More

అన్నీ చూడండి

కోతి తలపై రూ.51 వేల రివార్డు.. చివరకు అలా చిక్కింది?

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల దాఖలు.. టీడీపీ-వైకాపాల ఫైట్

అరబిందో ఇండస్ట్రీస్ యూనిట్‌లో అగ్ని ప్రమాదం.. ఏమైంది?

ప్రపంచ వాతావరణంపై ఎల్‌నినో పెను ప్రభావం

మంత్రులు, ఎమ్మెల్యేల కొనుగోలు ధరపై సీలింగ్.. సీఎం విజయ్ సర్కారు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

NTR & Trivikram :ఎన్.టి.ఆర్. సినిమాపై అప్ డేట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ సెరిట్ ఇకలేరు

Happy birthday Prabhas :టాలీవుడ్ ను కొత్త యుగంలోకి తీసుకెళ్తున్న కల్కి.. ప్రభాస్

రొమాన్స్‌, సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో డీఆర్‌ఆర్ ప్రొడక్షన్స్‌ చిత్రం

AK 47; దీపావళి కి ముందు ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47 వచ్చేస్తుంది

తర్వాతి కథనం
Show comments