గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

10-04-2020 శుక్రవారం మీ దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించినా...

మేషం : బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. స్త్రీలకు లాభం. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్స్, అనుకున్న చోటుకు బదిలీలు వంటివి ఏర్పడతాయి. ఆడిటర్లకు పనిభారం తగ్గడం వల్ల విశ్రాంతి లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. 
 
వృషభం : రాజకీయ కళా రంగాల వారికి సన్మానం జరిగే అవకాశం ఉంది. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అనుకోకుండా వ్యాపార విషయమై ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మీ లక్ష్యాన్ని చేరుకునే విషయంలో మెళుకువలు అవసరం. ఏ పనైనా మొదలుపెట్టేముందు అన్ని రకాలుగా ఆలోచన చేయండి.
 
మిథునం : మీ సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం పెరుగుతుంది. మీ పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకుసాగండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం లభిస్తుంది. 
 
కర్కాటకం : మీరు అనుకున్న కాంట్రాక్టులు చేతికి అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనం నపుడునపుడు మెళకువ అవసరం. నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి లభించే అవకాశం ఉంది. 
 
సింహం : మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిదికాదు. సన్నిహితుల సలహాతో కొన్ని పనులు చేపట్టిన పూర్తిచేస్తారు. నూతన పెట్టుబడుల విషయంలో నిదానంగా వ్యవహరించండి. దూరపు బంధువులను కలుసుకుని ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. రాజకీయ, కళారంగాలవారికి సామాన్యంగా ఉంటుంది. 
 
కన్య : వృత్తి వ్యాపారాల్లో అనుకోని మార్పులు. కాంట్రాక్టులు లభిస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొంత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. ధన వ్యయం అధికమవుతుంది. 
 
తుల : నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినపుడు ఆచి, తూచి వ్యవహరించండి. పనుల విషయంలో కాస్త మందకొడిగా ఉంటాయి. లెక్కకు మించిన బాధ్యతలతో సతమతమవుతారు. మీరు చేసే వృత్తి, ఉద్యోగాలలో మార్పు సంభవించవచ్చు. విద్యార్థులకు అనుకూలం. శ్రీవారు, శ్రీమతి విషయంలో మనస్పర్థలు తలెత్తే ఆస్కారం ఉంది. 
 
వృశ్చికం : వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు వంటివి పెరుగుతాయి. విద్యార్థులు ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మిత్రులతో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరుపుతారు. నూతన వస్తు, వస్త్రలాభం. ఆకస్మికంగా ప్రయాణాలు చేయలవలసి వస్తుంది. 
 
ధనస్సు : దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కలప వ్యాపారస్తులకు అభివృద్ధి. అనవసర ప్రసంగం వల్ల అధికారులతో అవగాహన కుదరకపోవచ్చు. ఐరన్ రంగం వారికి ఆటంకాలు, సిమెంట్ వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. క్రీడల పట్ల ఆసక్తి పెరుగును. ప్రైవేటు సంస్థల వారికి అనుకూలం. 
 
మకరం : గృహం, వాహనాలు కొనుగోలుచేస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరం. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మిత్రుల నుంచి సహాయం అందుకుంటారు. విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
కుంభం : పెట్టుబడులు పెట్టడానికి ఇది తగిన సమయం కాదని గమనించండి. ఊహిచని సంఘటనలు సైతం ఎదుర్కొనడానికి సింసిద్ధులై ఉండండి. పరిస్థితులను సమన్వయం చేసుకుని ముందుకుసాగండి. ఏది ఎలా జరిగితే అలాగే జరగనివ్వండి. దేనికీ తొందరపడవద్దు. నూతన వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. 
 
మీనం : ఆర్థిక విషయాలలో కొంత పురోగతి కానవస్తుంది. ఛిట్‌ఫండ్, ఫైనాన్స్ రంగాలలో వారికి చికాకు తప్పదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు చికాకులు ఎదురవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో దీక్ష వహిస్తారు. మీకు రావలసిన ధనం సకాలంలో మీ చేతికి అందుతుంది.