శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (10:35 IST)

23-12-2019 సోమవారం రాశిఫలాలు - ఇంటా, బయట ప్రోత్సాహకరంగా.. (video)

మేషం : సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. బంధుమిత్రుల రాకపోకలతో గృహం సందడి నెలకొంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇతర బాకీలు సకాలంలో చెల్లింపులు జరుపుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. 
 
వృషభం: ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. బంగారం, వస్త్రాలు, వాహనం వంటివి కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు జరగవచ్చు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు ఉత్సాహంగా ఉంటుంది. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. భూసంబంధ వ్యవహారాల్లో మెళకువ అవసరం. 
 
మిథునం : ఆదాయాభివృద్ధి. ఆరోగ్యంలో సంతృప్తికానరాదు. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు సామాన్యం. ప్రేమికులకు ఎడబాటు తప్పదు. కొంతమంది మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. విద్యార్థులకు తోటివారి సాన్నిహిత్యం, ఉపాధ్యాయులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
కర్కాటకం : స్త్రీల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. విద్యార్థినిలకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. భాగస్వామిక చర్చలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. స్పెక్యులేషన్ లాభదాయకం. తలచిన కార్యాలన్నీ త్వరగా నెరవేరగలవు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. రాబడి పెరిగి అవసరాలు తీరుతాయి. 
 
సింహం : కొన్ని విషయాల్లో అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. ఇంటా, బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సంతృప్తికానవస్తుంది. స్త్రీలకు షాపింగ్‌లోనూ, ప్రకటనల పట్ల ఏకాగ్రత ముఖ్యం. వృత్తి, ఉద్యోగస్తులకు సామాన్యం. విశ్రాంతిలోపం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
కన్య : బంధు మిత్రుల రాకపోకలతో గృహంలో సందడి కానవస్తుంది. ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం వృత్తి ఉద్యోగస్తులకు సామాన్యం. ముఖ్యులను కలుసుకుంటారు. మీ ఆలోచనలు, పథకాలు క్రియారూపంలో పెడతారు. ఆర్థిక విషయాల్లో సంతృప్తి, పురోభివృద్ధి. విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. 
 
తుల : కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు కలిసిరాగలదు. ఉద్యోగులకు స్వల్ప చికాకులు ఉన్నప్పటికీ ప్రతి విషయంలో చొచ్చుకుని ముందుకుపోతారు. విందు, వినోదాలు, బంధువులతో అధికభాగం కాలక్షేపం చేస్తారు. స్త్రీలకు ప్రతి విషయంలో ఓర్పు, నేర్పు అవసరం. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు ధనం సర్దుబాటుకాగలదు. 
 
వృశ్చికం : స్త్రీలతో మితంగా సంభాషించండి. పొదుపు పథకాలు, నూతన వ్యాపారాల దిశగా మీ ఆలోచనలు ఉనంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో సంతృప్తి, పురోభివృద్ధి. సంఘంలో గుర్తింపు, ప్రశంసలు పొందుతారు. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. 
 
ధనస్సు : ఉద్యోగస్తులకు అధికారులతో సంత్సబంధాలు నెలకొంటాయి. వాయిదాపడిన పనులు ఎట్టకేలకు పూర్తిచేస్తారు. ఆత్మీయులకు విలువైన కానుకలందిస్తారు. స్త్రీలు విలువైన వస్తు, ఆభరణాలు అమర్చుకుంటారు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్య, ప్రయాసలు తప్పవు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
మకరం : కొబ్బరి, పండ్లు, పూల, పానీయ, చిరు వ్యాపారాలు లాభాటిగా సాగుతాయి. స్త్రీలకు ఏ విషయంపైనా ఆసక్తి పెద్దగా ఉండదు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. కుటుంబీకుల కోసం అధిక ధన వ్యయం చేస్తారు. ఆత్మీయులరాక సంతోషం కలిగిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం ఫలించదు. 
 
కుంభం : ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని అనుకున్న పనులు పూర్తికావు. ఆపత్సమయంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు. స్త్రీలకు విలువైన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ సంతానం పై చదువుల కోసం బాగా శ్రమిస్తారు. ధనం ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. 
 
మీనం : కొత్తగా చేపట్టిన వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. వృత్తులవారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. బంధు మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం.