శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 21 డిశెంబరు 2019 (11:12 IST)

21-12-2019 శనివారం మీ రాశి ఫలితాలు (video)

లలిత సహస్రనామం చదివినా లేకుంటే విన్నా శుభం కలుగుతుంది. 
 
మేషం : స్వశక్తితో పైకొచ్చిన మీరు మరింత ముందుకెళ్ళాలంటే తగిన సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. రోజువారీ ఖర్చులు అధికమవుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. దూర ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడతాయి. 
 
వృషభం : భాగస్వాముల మధ్య అవరోధాలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. దైవ, సేవ, పుణ్య కార్యాలలో నిమగ్నమవుతారు. సన్నిహితుల కోసం మీ పనులు వాయిదావేసుకోవలసి వస్తుంది. ప్రింటింగ్ స్టేషనరీ రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విదేశీయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. 
 
మిథునం : ఉద్యోగ, వ్యాపారాల్లో అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ జీవిత భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. బాధ వంటి వాటిని వదిలి సంతోషమైన జీవితాన్ని గడపండి. నియమాలకు కట్టుబడి ఉండుట వల్ల నిర్ణయాలు తీసుకోలేక పోతారు. ఉత్తర ప్రత్యుత్తరాలలో ఏకాగ్రత అవసరం. 
 
కర్కాటకం : ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వ్యాపార విషయముల యందు జాయింట్ సమస్యలు రావచ్చును. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. కొంతమంది మిమ్మలను తప్పుత్రోవ పట్టించి, లబ్దిపొందడానికి యత్నిస్తారు. 
 
సింహం : పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు సదావకశాలు లభిస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆత్మీయుని రాక చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. న్యాయవాదులు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, అవాంతరాలు తప్పవు. 
 
కన్య : తలపెట్టిన పనిలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తిగా పూర్తిచేస్తారు. కొనుగోలుదార్లతో వివాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. రావలసిన ఆదాయంలో కొంతమొత్తం అందుతుంది. పొదుపు పథకాలు నూతన పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తలెత్తుతాయి. 
 
తుల : పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రేమికుల వ్యవహారం చర్చనీయాంశమవుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు అధికమవుతాయి. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. పెద్దలకు అపుడపుడు వైద్య సేవ తప్పదు. స్త్రీలకు పనిలో చికాకులు అధికం. 
 
వృశ్చికం : వ్యాపార వర్గాల వారు కొనుగోలుదార్లతో జాగ్రత్తగా మెలగవలసి వస్తుంది. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. ఓర్పు, సర్దుబాటు ధోరణితో వ్యవహరించడంతో ఒక సమస్య పరిష్కారం కాగలదు. 
 
ధనస్సు : మిత్రుల సహకారంతో ఓ సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. హోటల్, తినుబండ, కేటరింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చే కాలం. విద్యార్థులు మొండివైఖరి అవలంభించడం వల్ల మాటపడక తప్పదు. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. ఇతరులకు అతి చనువు ఇవ్వడం మంచిదికాదని గమనించండి. 
 
మకరం : వ్యాపకాలు తగ్గించుకుని ఉద్యోగ, వ్యాపారాలపై దృష్టిసారించండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి కలిసివచ్చే కాలం. కోర్టు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. పాత వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. స్త్రీలకు నరాలు, పొట్ట, కాళ్ళకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
కుంభం : ఆర్థిక ఒడిదుడుకుల వల్ల చికాకులను ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ప్రతిఫలం లభించదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు. 
 
మీనం : ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు టీవీ, కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. విద్యార్థినుల మొండితనం అనర్థాలకు దారితీస్తుంది. గృహంలో ఏదైనా వస్తువు పోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.