మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

17-12-2019 మంగళవారం మీ రాశి ఫలితాలు

ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. ప్రైవేట్ సంస్థల్లోని వారి నిర్లక్ష్యం, మతిమరుపు వల్ల యాజమాన్యం కోపతాపాలకు గురికావలసి వుంటుంది. మీ కళత్ర మొండి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. నమ్మకం పట్టుదలతో యత్నాలు సాధించండి. 
 
వృషభం: ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే కోరిక బలపడుతుంది. ప్రైవేట్ ఫైనాన్సులో మదుపు చేయడం మంచిది కాదని గమనించండి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉపాధ్యాయులు ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించండి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. 
 
మిథునం: ఆలయాలను సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. కలప, ఐరన్, ఇటుక, ఇసుక, సిమెంట్ వ్యాపారులకు సామాన్యం. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు.
 
కర్కాటకం: అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. ఆకస్మిక దూర ప్రయాణాలు తప్పవు. ఉద్యోగస్తులు అనవసర విషయాలకు, అపరిచిత వ్యక్తులకు దూరంగా వుండటం మంచిది. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి.
 
సింహం: స్థిరాస్తి కొనుగోలు లేదా అభివృద్ధి దిశగా మీ ఆలోచనలు వుంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. విద్యార్థులు అధిక ఉత్సాహం ప్రదర్శించడం వల్ల సమస్యలకు లోనవుతారు. మీకు, బంధువులకు మధ్య తలెత్తిన కలతలన్నీ దూరమై అంతా కలిసిపోతారు.
 
కన్య: రాజకయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తప్పవు. బంధువులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. తొందరపడి సంభాషించడం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. పత్రిక, వార్తా సంస్థల్లోని వారు అక్షర దోషాలు తలెత్తుకుండా జాగ్రత్త వహించాలి.
 
తుల: మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోవడం మంచిది. అసాధ్యమనుకున్న ఒక వ్యవహారం మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. డాక్టర్లకు అనుభవజ్ఞులతో పరిచయాలు, మంచి గుర్తింపు లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పండ్లు, పూలు, కొబ్బరి, పానీయ వ్యాపారులకు లాభదాయకం.
 
వృశ్చికం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులు తప్పవు. బేకరి, స్వీట్స్, తినుబండారాల వ్యాపారులకు, తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఎంతటి కార్యానైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.
 
ధనస్సు: విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. గత విషయాల గురించి ఆలోచిస్తూ కాలం వ్యర్థం చేయకండి. మీ తప్పులను సరిదిద్దుకోవటానికి యత్నించండి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడి, చికాకులు అదికమవుతాయి.
 
మకరం: ప్రింటింగ్ రంగాల్లో వారికి పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత, మెళకువ చాలా అవసరం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధనసహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం.
 
కుంభం: ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. కుటుంబీకుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. రుణాల కోసం అన్వేషిస్తారు. భాగస్వామిక సమావేశంలో కొత్త విషయాలు  చర్చకు వస్తాయి. నమ్మకం, పట్టుదలతో మీ యత్నాలు సాగించండి. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. 
 
మీనం: రాజకీయ నాయకులు సభాసమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. మీ వాగ్ధాటి, చాకచక్యంతో ఎదుటివారిని మెప్పిస్తారు. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, చికాకులు చోటుచేసుకుంటాయి. నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు స్టాకిస్టులకు లాభదాయకం.