సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2019 (11:57 IST)

16-12-2019 మీ రాశి ఫలితాలు.. ఉమాపతిని పూజించినట్లైతే..? (video)

ఉమాపతిని పూజించినట్లైతే మీ సంకల్పం సిద్ధిస్తుంది. 
 
మేషం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత చాలా అవసరం. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉంటుంది. కోరుకున్న వ్యక్తులు తారసపడుతారు. ఎంతటి క్లిష్ట సమస్యనైనా చాకచాక్యంగా ఎదుర్కొంటారు. ఖర్చులు పెరగడంతో అదనపు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. 
 
వృషభం: మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. వాహన చోదకులకు మరమ్మతులు, జరిమానా వంటి చికాకులు తప్పవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. 
 
మిథునం: ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక వుండదు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుతుంది. పనివారలను అతిగా విశ్వసించడం మంచిది కాదు. 
 
కర్కాటకం: ఆర్థిక, ఆరోగ్య సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలకు ఆరోగ్యం మందగించే సూచనలున్నాయి. 
 
సింహం: మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. విద్యుత్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు పనిభారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. బకాయిలు, ఇంటి అద్దెల వసూళ్లలో చికాకులు, ప్రయాసలు తప్పవు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు. 
 
కన్య: స్త్రీలు, టీవీ, ఛానల్స్ కార్యక్రమాల్లో బాగుగా రాణిస్తారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, పరిచయం లేని వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారాల్లో ఎదురైన పోటీని ధీటుగా ఎదుర్కొంటారు. 
 
తుల: కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన అవసరం. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు వృత్తిపరమైన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇంటికి చిన్న చిన్న మరమ్మత్తులు చేయించే అవకాశం వుంది. రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదా పడతాయి. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు 
 
వృశ్చికం: విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. మీ సంతానం కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. ఒకానొక వ్యవహారంలో మీ ప్రమేయం మంచి ఫలితాలనిస్తుంది. నిర్మాణ పథకాల్లో పనివారితో లౌక్యం అవసరం. 
 
మకరం: రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులెదుర్కుంటారు. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ప్రతి విషయానికీ ఇతరులపై ఆధారపడే మీ ధోరణి మార్చుకోవడం శ్రేయస్కరం. శత్రువులు సైతం మిత్రులుగా మారి చేయూత నందిస్తారు. 
 
కుంభం: కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు, ఒత్తిడి, సమస్యలు అధికమవుతాయి. వాహన చోదకులకు చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. విద్యార్థులు, క్రీడ, క్విజ్ వంటి పోటీల్లో రాణిస్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఓర్పు, శాంతియుతంగా వ్యవహరించడం వల్ల ఒక సమస్య సానుకూలంగా పరిష్కారమవుతుంది. 
 
మీనం: బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రముఖులతో పరిచయాలు మీ పురోభివృద్దికి సహకరిస్తాయి. స్త్రీలు భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడం మంచిది. భాగస్వాముల సమన్వయం లోపించడంతో విడిపోవాలనే ఆలోచన బలపడతుంది. అయిన వారి కోసం ధనం బాగా వ్యయం చేస్తారు.