శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2019 (12:45 IST)

17-12-2019 మంగళవారం మీ రాశిఫలాలు - స్త్రీలకు పనివారలతో ... (video)

మేషం : ఊహించని ధన నష్టం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. కుటుంబీకులతో కలహాలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సామాజిక, సేవా కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మిత్రులను కలుసుకుంటారు.
 
వృషభం : ఉద్యోగస్తుల పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్, వృత్తుల వారికి పురోభివృద్ధి. విద్యార్థులకు క్రీడ, కళారంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఛిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు.
 
మిథునం : ఐరన్, సిమెంటు, కలప వ్యాపారస్తులకు పురోభివృద్ధి. స్త్రీలకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాలలో ఆశాభంగం తప్పదు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు, చిన్నతరహా పరిశ్రమల వారికి కలసి రాగలదు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు.
 
కర్కాటకం : బంధువుల మధ్య సయోధ్య లోపిస్తుంది. ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో ఏకీభావం కుదరదు. వైద్య రంగాల్లోని వారికి శస్త్ర చికిత్సల సమయంలో ఏకాగ్రత అవసరం. ఆధ్యాత్మిక, సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు, ఇతరత్రా చెల్లింపులు అధికమవుతాయి.
 
సింహం : ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు వాయిదా పడతాయి. ఆహార వ్యవహారాలలో మెలకువ వహించండి. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు అధిక శ్రమ తప్పదు. ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. సమయానికి కావలసిన వస్తువులు కనిపించక విసుగు చెందుతారు.
 
కన్య : దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహించలేరు. నూతన పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. అవివాహితులకు అందిన ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ప్రేమికులకు పెద్దల ఆమోదం లభించటంతో వారిలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. ఇంజనీరింగ్, మెడికల్, శాస్త్ర రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది.
 
తుల : మీ మాటతీరును ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రగతి పథంలో సాగుతాయి. పెద్దల మాట పెడచెవిన పెట్టి ఇబ్బందులకు గురికాకండి. వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. పాత వ్యవహారాలు జ్ఞప్తికి రాగలవు.
 
వృశ్చికం : నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీ వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ఉద్యోగస్తులు తోటివారి ద్వారా ఆసక్తికరమైన విషయాలను గ్రహిస్తారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. ముఖ్యుల నుండి అందుకున్న ఆహ్వానాలు సంతోష పరుస్తాయి. క్రయ విక్రయాల్లో మెలకువ అవసరం.
 
ధనస్సు : ట్రాన్స్‌ఫోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లోని వారికి మిశ్రమ ఫలితం. పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో అధిక శ్రమ ఎదుర్కొనక తప్పదు. ప్రేమికులకు ఎడబాటు తప్పదు.
 
మకరం : ఒక వ్యవహారంలో కొన్నింటిని వదులుకోవటం వల్ల నష్టంకంటే అధికంగా మనశ్శాంతిని పొందుతారు. కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమల్లోని వారికి ఆందోళన తప్పదు. వృత్తుల్లోని వారికి గుర్తింపు లభిస్తుంది. వైద్యులకు సమస్యలు, ప్లీడర్లకు ప్రోత్సాహం కానవస్తుంది. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు.
 
కుంభం : విద్యార్థుల తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలకు గురవుతారు. ఉచిత సలహా ఇచ్చి ఎదుటివారి ఉద్రేకానికి లోనుకాకండి. నిరుద్యోగులు తొందరపాటు నిర్ణయాలవల్ల సదవకాశాలు జారవిడచుకోవచ్చు. స్త్రీల మనోవాంఛలు అధికం అవటం వల్ల ఇబ్బందులకు గురి కాగలరు.
 
మీనం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ పరిస్థితులు క్రమేణా మెరుగుపడతాయి. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉండగలవు. గృహంలో ఒక శుభకార్యం చేయాలన్న మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి.