బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : బుధవారం, 25 జులై 2018 (08:47 IST)

బుధవారం (25-07-18) దినఫలాలు - బంధువుల రాకతో ఊహించని...

మేషం: కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. శస్త్రచికిత్స చేయునపుడు వైద్యు

మేషం: కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. శస్త్రచికిత్స చేయునపుడు వైద్యులకు ఏకాగ్రత, మెళకువ అవసరం. రాజకీయాల్లో వారు సంక్షోభం వంటివి ఎదుర్కుంటారు.
 
వృషభం: హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ప్రింటింగ్ స్టేషనరీ రంగాలలో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఇతరులకు ఇచ్చిన ధనం తిరిగి రాబట్టుకోవడం సాధ్యం కాదని గమనించండి. దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలలో ఇబ్బందులు తలెత్తుతాయి.
 
మిధునం: ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్ ఆర్డరు చేతికందుతుంది. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం విరివిగా వ్యయంచేస్తారు. ఎ.సి. కూలర్ మోకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. ఉపాధ్యాయులు చర్చలు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం: బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత వంటి శుభపరిమాణాలు ఉంటాయి. ప్రముఖులను కలుసుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి లభించే అవకాశం ఉంది. అకాల భోజనం, శారీరక శ్రమ వలన ఆరోగ్యం మందగిస్తుంది. కీడు తలపెట్టే స్నేహానికి దూరంగా ఉండండి.
 
సింహం: స్త్రీలకు టీ.వి ఛానెళ్ల నుంచి ఆహ్వానం, ధనప్రాప్తి, వస్తులాభం వంటి ఫలితాలున్నాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ వాహనం ఇతరులకు ఇవ్వడం మంచిది కాదని గమనించండి. ఇంట మీ మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు.
 
కన్య: రహస్య విరోధులు అధికం కావడం వలన రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. ఉపాధ్యాయులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో ప్రయాణాలు సాగిస్తారు. వాణిజ్య ఒప్పందాలకు అనువైన కాలం. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. పెంపుడు జంతువులపై ఆసక్తి అధికమవుతుంది.
 
తుల: వ్యాపార వర్గాల వారికి పెద్దమెుత్తంలో చెక్కులిచ్చే విషయంలో పునరాలోచన మంచిది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. దూరప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడుతాయి. మీ సంతానం విద్యా, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరుస్తారు. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు.
 
వృశ్చికం: వాతావరణంలోని మార్పు వ్యవసాయదారులకు ఆందోళన కలిగిస్తుంది. కళా రంగాలకు చెందిన వారు లక్ష్యాలు సాధిస్తారు. దైవ సేవా, పుణ్యకార్యల్లో చురుకుగా వ్యవహరిస్తారు. వ్యాపారాల్లో నష్టాలను అధికమించడానికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. కుటుంబీకులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
ధనస్సు: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లోను, వస్తు నాణ్యతలోను మెళకువ అవసరం. కొన్ని వ్యవహారాలు అనుకూలించక పోవడం వలన మానసిక ఒత్తిడికి లోనవుతారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది.
 
మకరం: సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు, ఉన్నత పదవుల మైత్రి అధికమవుతుంది. వృత్తి ఉద్యోగ పనులు మధ్యస్తంగా సాగుతాయి. ఇతరులకు పెద్దమెుత్తంలో రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
కుంభం: వృత్తుల వారికి ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. యోగం, ధ్యానం, విరామ కాలక్షేపాలు ఊరట కలిగిస్తాయి. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీసే ఆస్కారం ఉంది. వేడుకల్లో చిన్నారులు కీలక పాత్ర పోషిస్తారు.
 
మీనం: నూతన దంపతులకు ఎడబాటు, చికాకులు తప్పవు. విద్యుత్ రంగాల వారికి పనివారలతో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి తగు ప్రోత్సాహం లభిస్తుంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూవస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. ఎంతో కొంత పొదుపు చేద్దామన్న మీ ఆలోచన ఫలించకపోవచ్చు.