ఆదివారం, 16 మార్చి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 మార్చి 2025 (09:31 IST)

Gangaur Vrat: గంగౌర్ గౌరీ పూజ పార్వతీ పరమేశ్వరులకు అంకితం.. ఇలా చేస్తే?

lord shiva
గంగౌర్ గౌరీ పూజ ఉత్తరాదిన జరుపుకుంటారు. 'హోలిక దహన్' నుండి బూడిదను సేకరించి, దానిలో బార్లీ గింజలు,  గోధుమలను మొలకెత్తి పెట్టడంతో ప్రారంభమవుతుంది. ఒక ఆచారంగా ఈ విత్తనాలు మొలకెత్తడం ప్రారంభించే వరకు ప్రతిరోజూ నీరు పోస్తారు. ఇది మొత్తం 18 రోజులు కొనసాగుతుంది. 
 
గంగార్ పూజ పార్వతీ పరమేశ్వరలుకు అంకితం చేయబడింది. గంగౌర్ వ్రతాన్ని భక్తితో ఆచరించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ముఖ్యంగా రాజస్థాన్‌లో, గంగార్ పండుగ సమయంలో గొప్ప 'మేళా' లేదా ఉత్సవాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా వివాహిత మహిళలు, తమ భర్తల దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం గంగార్ పండుగ సమయంలో గౌరీ దేవిని పూజిస్తారు. 
 
అవివాహితులు తమకు కావలసిన భర్తలను పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అంతేకాకుండా గంగౌర్ వ్రత ఉత్సవాలు ఎదురుచూస్తున్న వసంత రుతువు రాకను కూడా సూచిస్తాయి. దక్షిణాదిన ఈ ఆచారం లేకపోయినా.. ఈ రోజు పార్వతీపరమేశ్వరులను పూజించే వారికి సర్వాభీష్టాలు చేకూరుతాయి.