సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (13:38 IST)

ఈ రాశుల వారు హనుమంతుడిని పూజిస్తే..

హనుమంతుడు మూలా నక్షత్రం, అమావాస్య తిథి నాడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అందుకే మూలా నక్షత్రం నాడు పుట్టిన జాతకులు ప్రతి శనివారం, మంగళవారం హనుమంతుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు వుంటాయి. అంతేగాకుండా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. 
 
ఏలినాటి శని ప్రభావంతో ఆందోళనలు పెరుగుతాయి. ఈతి సమస్యలుంటాయ. అలాంటి వారు హనుమంతుడిని పూజిస్తే ఆటంకాలు వాటంతట అవే తొలగిపోతాయి. శత్రువుల బలం తగ్గుతుంది. 
 
అలాగే తులసి మాల ధరిస్తే దుఃఖాలు దూరమవుతాయి. మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకరం. కుంభ రాశి వ్యక్తులు శనిచే పాలించబడతారు. అందుచేత ఈ జాతకులు హనుమంతుడి పూజతో అనుకున్నది పొందవచ్చునని.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. అంతే కాకుండా ఇతర రాశుల వారు కూడా హనుమంతుని పూజ చేస్తే ఐశ్వర్యం, కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.