శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2017 (11:37 IST)

ముక్కుపుడక ధరిస్తే... జలుబు, తలనొప్పి తగ్గుతుందట..!

ముక్కు, చెవులకు మహిళలు ఆభరణాలు ధరించడం అందం కోసం మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా అవి మేలు చేస్తాయట. ముఖ్యంగా ముక్కుపుడక మహిళలు ధరిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందట. సాధారణంగా పురుషుల శ్వాస కంటే.. మ

ముక్కు, చెవులకు మహిళలు ఆభరణాలు ధరించడం అందం కోసం మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా అవి మేలు చేస్తాయట. ముఖ్యంగా ముక్కుపుడక మహిళలు ధరిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందట. సాధారణంగా పురుషుల శ్వాస కంటే.. మహిళల తీసుకునే శ్వాసకు శక్తి అధికం.

అందుచేత ఆ కాలం నుంచే మహిళలకు ముక్కుపుడక ధరించే ఆచారం వాడుకలో వుంది. ముక్కుపుడక ధరించడం ద్వారా, చెవిపోగులు ధరించడం ద్వారా శరీరంలోని వున్న వాయువులు తొలగిపోతాయి. తద్వారా శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. 
 
శరీరంలోని ఉష్ణోగ్రతను గ్రహించి చాలా సేపటికి తనలో వుంచుకునే శక్తి బంగారానికి వుంది. అందుకే ముక్కుపుడక బంగారంలో ధరిస్తారు. ముక్కు కుట్టడం ద్వారా నరాల వ్యవస్థలో ఉన్న చెడు వాయువులు దూరమవుతాయి. రజస్వల అయిన యువతుల తల ప్రాంతంలో కొన్ని రకాల వాయువులు వుంటాయి.

ఆ వాయువులు తొలగిపోయేందుకే ముక్కు కుట్టడం చేస్తారు. ముక్కుపుడక ధరించడం ద్వారా మహిళల్లో జలుబు, తలనొప్పి, శ్వాస సంబంధిత రోగాలను దూరం చేసుకోవచ్చు. అంతేగాకుండా దృష్టిలోపాలు వుండవు. నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా దరి చేరవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.