మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (11:17 IST)

కన్యారాశి జాతకులు తమలపాకులో మిరియాలను ఉంచి.. గురువారం పూట?

కన్యారాశి - తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే.. దుఃఖం దూరమవుతుంది. తులాం రాశి- తమలపాకులో లవంగంను ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి

12 రాశుల్లో జన్మించిన జాతకులు ఏ దేవుళ్లకు తాంబూలం సమర్పించి ప్రార్థించాలో తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి. 12 రాశుల్లో పుట్టిన జాతకులు రాశి ప్రకారం ఏ దేవునికి తాంబూలం సమర్పించి వేడుకుంటే.. ఈతిబాధలు తొలగిపోతాయనేది తెలుసుకుందాం..    
 
1. మేషం - తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలుండవు. 
2. వృషభం - తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్తుతిస్తే.. కష్టాలుండవు. సుఖసంతోషాలు చేకూరుతాయి. 
 
3. మిథునం - తమలపాకులో అరటిపండును ఉంచి బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
 
4. కర్కాటకం- తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి. 
5. సింహం - తమలపాకులో అరటిపండును ఉంచి గురువారం ఇష్టదేవతా పూజను చేయాలి. 
6. కన్యారాశి - తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే.. దుఃఖం దూరమవుతుంది. 
7. తులాం రాశి- తమలపాకులో లవంగంను ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. 
 
8. వృశ్చికం- తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. 
 
9. ధనుస్సు - తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.
 
10. మకరం - తమలపాకులో బెల్లంను ఉంచి శనివారాల్లో కాళిమాతను పూజిస్తే.. కష్టాలు తీరిపోతాయి. 
11. కుంభం - తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళిమాతను పూజించినట్లైతే.. దుఃఖాలు తొలగిపోతాయి. 
12. మీనం - తమలపాకులో పంచదారను ఉంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.