1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : బుధవారం, 16 మే 2018 (17:12 IST)

మరకత లింగానికి పాలాభిషేకం చేయిస్తే.. ఏం జరుగుతుంది?

పచ్చని రంగుతో కూడిన మరకతానికి మెరిసే తత్త్వం వుంది. ఇందులో సిలికాన్, అల్యూమినియం, మెగ్నీషియం వంటి రసాయనాలున్నాయి. ఓ గాజు పాత్రలో పాలను పోసి అందులో మరకత మణిని వేస్తే.. పాలు మొత్తం పచ్చరంగును సంతరించుకు

పచ్చని రంగుతో కూడిన మరకతానికి మెరిసే తత్త్వం వుంది. ఇందులో సిలికాన్, అల్యూమినియం, మెగ్నీషియం వంటి రసాయనాలున్నాయి. ఓ గాజు పాత్రలో పాలను పోసి అందులో మరకత మణిని వేస్తే.. పాలు మొత్తం పచ్చరంగును సంతరించుకుంటుంది. అలాగే నీటిలో మరకత రత్నాన్ని వేస్తే అది కూడా పచ్చని రంగులో మారిపోతుంది. ఈ మరకత రత్నం విలువైనది. 
 
అలాంటి మరకత పచ్చలో చేసిన లింగాన్ని పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. అంతేగాకుండా మరకత లింగాన్ని పూజించడం ద్వారా సకల దోషాలు నివృత్తి అవుతాయి. నవగ్రహాల్లో బుధ గ్రహానికి చెందిన రత్నంగా మరకతమణిని చెప్తారు. విద్య, ఆరోగ్యం, అధికారం లభించాలంటే.. మరకత లింగాన్ని పూజించాలి. ఇంకా వ్యాపారంలో రాణించాలంటే.. మరకత లింగాన్ని అర్చించాలి.  
 
మరకత లింగాన్ని ఇంద్రుడు పూజించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అందుచేత మరకత లింగాన్ని పూజించడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. మరకత లింగానికి పాలాభిషేకం చేస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. అలాగే రాత్రిపూట మరకత లింగానికి చందనాన్ని పట్టించి.. ఉదయం దాన్ని నుదుట ధరిస్తే.. ఆరోగ్యం చేకూరుతుంది.
 
మరకత పచ్చను ధరించడం వలన మంత్రతంత్ర బాధలుండవు. ధనలాభం వుంటుంది. దృష్టి దోషాలను పోగొడుతుంది. ఆశ్లేష, జేష్ట్య, రేవతి నక్షత్ర జాతకులు ధరించవచ్చు. ఈ జాతకులు ఈ మరకత పచ్చలో గల లింగాన్ని పూజిస్తే ఇంకమంచిది. జ్ఞాపకశక్తి పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.