మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 డిశెంబరు 2024 (14:13 IST)

2025 Nostradamus Predictions: 2025లో కోటీశ్వరులయ్యే రాశులు..?

Astrology
2025లో కోటీశ్వరులుగా రాజయోగంతో జీవితం సాగించే రాశి ఏదో తెలుసుకుందాం. 2025 సంవత్సరం ఎవరికెళ్లి కోటీశ్వర యోగం ఉంటుంది అని నోస్ట్రాడమస్ చెప్పారు. దాని గురించి ఇప్పడు తెలుసుకుందాం. ఫ్రెంచ్ జ్యోతిష్యుడు  నోస్ట్రాడమస్ అనేక అంచనాలు నిజమైనాయి. ఆ విధంగా 2025 సంవత్సరం ఎలా ఉంటుందో నోస్ట్రాడమస్ గుర్తించారు. ఈ క్రమంలో 2025 సంవత్సరం ఈ 7 రాశులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రాశులేంటో చూద్దాం. 
 
మేష రాశివారికి 2025 సంవత్సరం అన్నీ విధాల కలిసొస్తాయి. కొత్త సంకల్పంతో మనోధైర్యంతో పనిచేసే అవకాశం లభిస్తుంది. తొందరపాటు నిర్ణయం తగదు. ఏదైనా ప్రణాళికాబద్ధంగా నిర్వహించబడుతుంది. ఆర్థిక విషయాల్లో మెరుగైన ఫలితాలు వుంటాయి. 
 
వృషభ రాశికి 2025 నూతన సంవత్సర ఫలం: వృషభ రాశి జాతకులు తీవ్రంగా శ్రమిస్తారు. అవకాశాలను ఈ ఏడాది  సద్వినియోగం చేసుకోవచ్చు. వ్యాపారం, దీర్ఘకాలిక పెట్టుబడులు ఈ సంవత్సరం ఉత్తమం.
 
మిథున రాశి వారికి 2025 ఇది స్థిరమైన వృద్ధిని ఇస్తుంది. 2025 విజయం మీ సొంతం అవుతుంది. బుద్ధి వికాసం చెందుతుంది. అయితే అప్రమత్తంగా వుండాల్సి వుంటుంది. నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాల్సి వుంటుంది. 
 
సింహరాశి వారికి సాధారణంగా ఆత్మవిశ్వాసం ఎక్కువ. పెట్టుబడులకు అనుకూలం. సరైన ప్రణాళిక విజయానికి దారితీసింది. తులారాశికి చెందిన జాతకులకు 2025వ సంవత్సరం సంపదను ఇస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. 
 
మకర రాశికి 2025వ సంవత్సవం అనుకూలం. సహనం ముఖ్యం. కొత్త సమస్యలు వస్తాయి. కానీ సవాలులను అధిగమించడానికి మీకు కష్టాలు వస్తాయి. సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అయితే సమస్యలను ధీటుగా ఎదుర్కొంటారు. మీనం రాశికి 2025వ సంవత్సరం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఆధ్యాత్మికత  పెంపొందుతుంది.