సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 9 డిశెంబరు 2019 (21:40 IST)

పరుగెడుతున్నట్లు కల వస్తే ఏంటి ఫలితం?

పసిపిల్లలకు సంరక్షణ చేసినట్లు కల వచ్చినట్లైతే ధనము, అదృష్టము కలుగును. పసిపిల్ల చనిపోయినట్లు కల వచ్చినట్లైతే దారిద్ర్యము కలుగును. పసిపిల్ల కావలసినట్లు కల వచ్చిన ధనలాభము కలుగును. పందెములో పరుగెత్తుచున్నట్లు కల వచ్చిన ధనలాభము కలుగును. పచ్చని పర్వతములు చూసినట్లు కల వచ్చినట్లైతే? సుఖసంతోషములు కలుగును. పర్వతముపై ఎక్కినట్లు కల వచ్చిన త్వరలో ధనలాభము, అపరితమైన ఎక్కినట్లు కల వచ్చిన త్వరలో ధనలాభము, అపరిమితమైన సంతోషము కలుగును. 
 
పందెములో పరుగెత్తుచున్నట్లు కలవచ్చిన సంతోషకరమైన వార్తలు వినగలరు. ఏదైనా పత్రిక చదువుతున్నట్లు కలవచ్చిన తమను అనుకూలమైన వర్తమానం వినగలరు. అడవిలోకి వెళ్ళుచున్నట్లు కల వచ్చిన మనః క్లేశము కలుగును. తనయొక్క పాదరక్షలు దొంగించబడినట్లు కలవచ్చిన వాని భార్యకు అనారోగ్యము కలుగును. పాదరసము చూసినట్లు కల వచ్చినట్లైతే అసౌఖ్యము కలుగును. పిల్లనగ్రోవిని వూదినట్లు కలవచ్చినట్లు కష్టములు కలుగును.