మంగళవారం పూట సాంబ్రాణితో ధూపం వేస్తే..? (video)
మంగళవారం పూట ధూపం వేయడం ద్వారా ఇంట్లోని ప్రతికూలతలు తొలగిపోతాయి. హోమం చేయడం ద్వారా ఏర్పడే ఉత్తమ ఫలితాలు సాంబ్రాణితో ధూపం వేయడం ద్వారా లభిస్తుంది. ఇంట్లో సాంబ్రాణితో ధూపం వేస్తే.. దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుంది. మహాలక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుంది. ముఖ్యంగా మంగళ, శుక్రవారాల్లో సాంబ్రాణితో ధూపం వేయడం ద్వారా శ్రీలక్ష్మి కటాక్షం లభిస్తుంది. ఇంకా ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం వుంటుంది.
సాంబ్రాణితో ధూపం వేయడం ద్వారా నరదృష్టి తొలగిపోతాయి. సాంబ్రాణితో చందనం వేసి ధూపమేస్తే.. లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. సాంబ్రాణితో గరిక పొడిని చేర్చి ధూపమేస్తే.. సకల దోషాలు నివృత్తి అవుతాయి.
సాంబ్రాణితో వట్టివేరు పొడిని చేర్చి ధూపమేస్తే కార్యసిద్ధి చేకూరుతుంది. సాంబ్రాణిలో వేపాకును వేసి ధూపమేస్తే.. సకల వ్యాధులు తొలగిపోతాయి. సాంబ్రాణిలో తెల్ల ఆవాలతో ధూపమేస్తే.. శత్రుభయం వుండదు. ఇంకా గోరింటాకు గింజల పొడితో ధూపవేయడం ద్వారా సర్వదా శుభం కలుగుతుంది.