దైవ పూజకు పుష్పాలు అవసరమా?
దైవ పూజకు పుష్పాలు తప్పనిసరి. పూజకు ఏయే పుష్పాలు ఉపయోగించాలో చూద్దాం.. పూజకు బంతిపూలు వాడకూడదని అంటారు. పూజకు ఉపయోగించే పువ్వులు తాజాగా వుండాలి. శివపూజకు సన్నజాజులు, బిల్వ పత్రాలు ఉన్నతమైనది.
తులసి, సంపంగి, తామర, గోరింటాకు పుష్పాలు కూడా పూజకు ఉత్తమమైనవి. ఉమ్మెత్తపువ్వులు కూడా దేవతా పూజకు శ్రేష్టం. తామర పువ్వులు, కలువ పువ్వులు, జాజులు, చామంతి, నందివర్ధనములు, మందారము, పారిజాతాలు, పద్మాలు, మంకెన, మునిగోరింట, ఎర్రగన్నేరు, గరుడవర్ధనము, నిత్యమల్లి పుష్పాలు పూజలకు పవిత్రమైనవి.
తెల్ల తామరలతో దైవాన్ని అర్చిస్తే భక్తి పెరుగుతుంది. తులసి దళాలు - ఆధ్యాత్మిక వికాసాన్ని, గన్నేరు, మల్లెపుష్పాలు - నిష్కల్మషబుద్ధిని, సంపెంగ పుష్పాలు - అభివృద్ధిని, నాగలింగ పుష్పాలతో పూజిస్తే ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. అలాగే ఎర్ర పుష్పాలు శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరం.
అలాగే తామర, శంఖు పుష్పాలతో చేసే పూజవల్ల అష్టైశ్వర్యాలు, మారేడు దళాలతో చేసే పూజవల్ల జ్ఞానాభివృద్ధి కలిగి ముక్తికలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి.