ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 13 ఆగస్టు 2023 (16:32 IST)

నల్ల బియ్యంతో ఆరోగ్యం! వాటిలోని పోషకాలు ఏంటి?

black Rice
నల్ల బియ్యంలో యాంటీ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే టాక్సిన్లను తొలగించి.. వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి. ముఖ్యంగా మహిళల్లో వ్యాధులను నియంత్రిస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 
 
నల్లబియ్యం చెడు, కొవ్వులను కరిగించడంలో సాయపడుతుంది. దీనివల్ల గుండెకు రక్తప్రసరణ బాగా జరిగి హృదయ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి.
 
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి ముడతలు తగ్గించి, కాంతిమంతంగా మారుస్తాయి. వృద్ధాప్య ఛాయల్ని నివారిస్తాయి.
 
నల్ల బియ్యం కంటిచూపు మెరుగుపరడంలో సాయపడుతుంది. రెటీనా దెబ్బతినకుండా చూస్తుంది. ఈ బియ్యంలో పీచు ఎక్కువ. దాంతో కడుపు నిండుగా అనిపించి ఇతర పదార్థాలపై దృష్టిమళ్లదు. బరువు అదుపులో ఉంటుంది.
 
నల్ల బియ్యంలోని యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఆలర్జీలు, ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా చేస్తాయి.
 
రోజువారీ అవసరాల్లో.. 60 శాతం ఐరన్ నల్లబియ్యం తినడం వల్ల లభిస్తుంది. రక్తహీనత రాకుండా ఉంటుంది. 
 
నల్ల బియ్యంలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను పెరగకుండా అడ్డుకుంటాయి. చక్కెర వ్యాధి ఉన్నవారు వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.