శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2023 (23:47 IST)

హెర్బల్ కాఫీ తాగండి.. హాయిగా జీవించండి..

coffee
జబ్బులు రాకుండా, ఎక్కువ మందులు తీసుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని సాధారణ పద్ధతులు పాటిస్తే సరిపోతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే హెర్బల్ కాఫీ తాగి అలవాటు చేసుకుంటే చాలు ఆరోగ్యం చేకూరుతుంది. అనారోగ్యం దూరం అవుతుంది. 
 
మెదడులోని నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి తాత్కాలికంగా రిఫ్రెష్‌గా వుంచడంలో హెర్బల్ కాఫీ ఎంతగానో ఉపయోగపడుతుంది. పాలతో కాఫీ, టీలు తాగడం మానేసి, ఇంట్లో వుండే శొంఠి, మిరియాలు, ధనియా, తులసిలను మెత్తగా రుబ్బుకుని దానితో కాఫీ తయారు చేసుకోవాలి. పంచదారకు బదులు బెల్లం వేస్తే ఆరోగ్యానికి ఎంతో చాలా మేలు జరుగుతుంది.
 
ఈ హెర్బల్ కాఫీతో జలుబు, దగ్గు, అజీర్ణం సహా శ్వాసకోశ వ్యాధులు దరి చేరవు. కాఫీ, టీలను నిరంతరం తాగడం వల్ల నాడీ వ్యవస్థ బలహీనపరుస్తాయి. హెర్బల్ కాఫీ దీనిని నివారిస్తుంది. హెర్బల్ కాఫీని ఇష్టపడని వారు నిమ్మరసాన్ని తేనెలో కలుపుకుని ప్రతిరోజూ ఉదయం తాగవచ్చు. 
 
ఒక కప్పు వేడి నీళ్లలో సగం నిమ్మకాయను పిండుకుని అందులో ఒక టీస్పూన్ తేనె కలిపి నిమ్మకాయ-తేనె రసాన్ని తయారు చేసి తాగాలి. నిమ్మ ద్వారా విటమిన్ సి సహా పోషకాలు లభిస్తాయి. తేనె కలుపుకుని తాగడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది. జలుబు, దగ్గు సమస్య ఉండదు. కఫాన్ని కూడా బయటకు పంపుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.