సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2023 (20:05 IST)

రిలయన్స్ జియో కొత్త వార్షిక రీఛార్జ్ ఆఫర్ ప్రయోజనాలేంటి?

jio reliance
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో కొత్త వార్షిక రీఛార్జ్ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్త వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆఫర్ ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. 2023 స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్‌ల ప్రయోజనాలు గత సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఆఫర్ ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నాయి. 
 
జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్ ధర రూ. 2,999గా నిర్ణయించారు. ఈ ఆఫర్ 365 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఇది వినియోగదారులకు రోజుకు 2.5 GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఇది JioCinema, JioTV, JioCloud వంటి సేవలకు సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది.
 
రూ. 2,999 జియో ఆఫర్ ప్రయోజనాలు: 
స్విగ్గీ రూ. 249 విలువైన ఆర్డర్‌లకు రూ. 100 తగ్గింపు
రూ. 249 విలువైన ఆర్డర్‌లకు విమాన టిక్కెట్ బుకింగ్‌లపై 100 తగ్గింపు వుంటుంది. 
అజియో సైట్‌లో రూ. 999 విలువైన ఎంపిక చేసిన ఉత్పత్తులపై రూ. 200 తగ్గింపు
 
రూ. 999 కంటే ఎక్కువ నెట్‌మెడ్స్ ఆర్డర్‌లపై 20 శాతం వరకు తగ్గింపు
రిలయన్స్ డిజిటల్ ఎంపిక చేసిన ఆడియో ఉత్పత్తులు, గృహోపకరణాలపై 10 శాతం తగ్గింపును అందిస్తుంది.