ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2025 (13:51 IST)

అనూరాధా నక్షత్రం రోజున శ్రీలక్ష్మీ పూజ.. బిల్వపత్రాలు.. ఉసిరికాయ.. శుక్రహోర మరిచిపోవద్దు..

Lakshmi Devi
Lakshmi Devi
అనూరాధా నక్షత్రం వచ్చే రోజున అదీ ఆ నక్షత్రంతో కలిసి శుక్రవారం కనుక వచ్చినట్లైతే విశేషం. ఈ నక్షత్రం ఫిబ్రవరి 20 మధ్యాహ్నం 01.30 గంటల నుంచి ఫిబ్రవరి 21 03:53 గంటల వరకు వుంటుంది. ఈ సమయంలో శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజించిన వారికి సర్వశుభాలు చేకూరుతాయి. ముఖ్యంగా శ్రీలక్ష్మిని ఈ రోజున బిల్వ పత్రాలతో అర్చించి.. ఉసిరికాయను నైవేద్యంగా సమర్పించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఇంటిల్ల పాదిని శుభ్రం చేసుకుని.. పూజకు అంతా సిద్ధం చేసుకుని మహాలక్ష్మిని 108 అష్టోత్తరాలతో కుంకుమార్చన చేసి.. ఆపై పాలతో చేసిన తీపి పదార్థులు, రవ్వతో చేసిన తీపి పదార్థాలు, ఉసిరికాయను తప్పకుండా నైవేద్యంగా సమర్పించినట్లైతే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం వుంటుంది. ఇంకా అనురాధా నక్షత్రం రోజున ఈ పూజను శుక్ర హోరను క్యాలెండర్‌లో సరి చూసుకుని చేయడం మంచిది. సాధారణంగా శుక్ర హోర ఫిబ్రవరి 21 ఉదయం 6-7 గంటల మధ్య, మధ్యాహ్నం 1-2 గంటల మధ్య వుంటుంది. ఆ సమయంలో ఈ పూజ చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
Lakshmi Devi
Lakshmi Devi
 
27 నక్షత్రాల్లో ఒకటైన అనురాధ నక్షత్రం శ్రీ మహాలక్ష్మికి చాలా ప్రీతికరమని.. అందుకే ఈ రోజున తనను పూజించే వారికి సకలసంపదలు, ఆయురారోగ్యాలు, ప్రసాదిస్తుందని విశ్వాసం.