ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (12:45 IST)

విష్ణువు జన్మనక్షత్రం శ్రవణం.. ఈ రోజున వరలక్ష్మీ వ్రతం చేస్తే..?

శ్రీ అనే పదం సిరిసంపదలను, శ్రేయస్సును సూచిస్తుంది. ఉన్నతిని కలుగచేస్తుంది. శ్రావణ శుక్రవారం పూట వచ్చే వరలక్ష్మీ వ్రతం రోజున సాయంత్రం పూట లక్ష్మీదేవికి పూజ ఉన్నత ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీదేవి శ్రావణ శ

శ్రీ అనే పదం సిరిసంపదలను, శ్రేయస్సును సూచిస్తుంది. ఉన్నతిని కలుగచేస్తుంది. శ్రావణ శుక్రవారం పూట వచ్చే వరలక్ష్మీ వ్రతం రోజున సాయంత్రం పూట లక్ష్మీదేవికి పూజ ఉన్నత ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీదేవి శ్రావణ శుక్రవారం, పూవుల్లోనూ, దీపాల్లోనూ, పసుపు కుంకుమల్లోనూ, తాంబూలంలోనూ, వెదురులోనూ, పండ్లలోనూ నివసిస్తుందట. 
 
అందుకే ముత్తైదువులు ఒకరికొకరు తాంబూలాలను ఇచ్చి పుచ్చుకుంటారు. ప్రతి ఇంటిని శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం రోజున దీప తోరణాలు, పూలతో అలకరించుకుంటే.. లక్ష్మీదేవి ఆ ఇంట నివాసం వుంటుందని పండితులు చెప్తున్నారు. కోరిన వరాలను ఇచ్చే మహాలక్ష్మీదేవిని వరలక్ష్మీ వ్రతం రోజున పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శ్రూసూక్తం చెప్తోంది. 
 
లక్ష్మీ కటాక్షం కోసం శ్రావణ శుక్రవారం పూజ విశేష ఫలితాలను ఇస్తుంది. పూర్వం ఓసారి లక్ష్మీదేవి... దుర్వాసముని శాపం వల్ల సాగర గర్భంలో చిక్కుకుని పోయిందట. సర్వ దేవతలు ఐశ్వర్యహీనులుగా మారిపోయారు. వారంతా తమ దారిద్ర్యాన్ని పోగొట్టమని విష్ణువును ప్రార్థించారు. భక్తవత్సలుడైన దామోదరుడు వారికి అభయాన్ని ఇచ్చాడు.
 
విష్ణు భగవానుని అనుగ్రహంతో.. అచ్యుతుని ఆదేశంతో దానవులతో కలిసి క్షీరసాగరాన్ని మధించారు. అందులో ప్రసన్న వదనంతో, నిర్మల చిత్తంతో మహాలక్ష్మి వారికి లభించిందని బ్రహ్మవైవర్తన పురాణం చెప్తోంది. 
 
ఇంకా లక్ష్మీదేవి చంద్రుని సహోదరి కావడంతో చల్లదనానికి, కమలవాసిని కనుక వికసిత మనస్సుకు ప్రతీక. ధనం, ధాన్యం, సౌభాగ్యం, సంతానం, ఆరోగ్యం, అష్టసిద్ధులు.. అష్టైశ్వర్యాలు కలిగించే లక్ష్మీదేవిని సత్య, భోగ, రాజ్య, యోగ, విద్య, సౌభాగ్య, అమృత, కామ్య, లక్ష్మీ స్వరూపాలుగానే కాకుండా వరాలనిచ్చే వరలక్ష్మీగా దేవిగా పూజిస్తుంటారు. 
 
ఈ లక్ష్మీ దేవినే విష్ణువు జన్మనక్షత్రం కూడిన శ్రావణ మాసంలో విశేషంగా పూజిస్తారు. వరలక్ష్మీ వ్రతం రోజునే శ్రవణ నక్షత్రం వస్తుంది. ఈ నక్షత్రం రోజున మహాలక్ష్మిని పూజించిన వారికి శుభాలు చేకూరుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.