మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : బుధవారం, 22 ఆగస్టు 2018 (16:59 IST)

ప్రభాస్ సాహో తర్వాత పెళ్లి పీటలెక్కుతాడా?

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ ప్రభాస్.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు.. ఎప్పుడు ఒకింటివాడవుతాడని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ పెళ్లిపై రకరకాల వార్తలు వచ్చినా.. డార్లింగ్ మాత్రం పెళ్లిపై

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ ప్రభాస్.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు.. ఎప్పుడు ఒకింటివాడవుతాడని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ పెళ్లిపై రకరకాల వార్తలు వచ్చినా.. డార్లింగ్ మాత్రం పెళ్లిపై స్పందించేందుకు పెద్దగా స్పందించలేదు. 
 
అయితే తాజాగా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి ఓ హింట్ ఇచ్చారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని అనుకున్నాం. అప్పుడేమో బాహుబలి తర్వాత అన్నాడు. ఇప్పుడేమో సాహో సినిమా కాగానే అంటున్నాడని కృష్ణంరాజు చెప్పారు. 
 
తాజాగా ప్రభాస్‌ పెళ్లిపై కృష్ణంరాజు స్పందించారు. పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు బలవంతపెట్టినా ప్రభాస్ అప్పుడూ ఇప్పుడూ అంటూ పోస్ట్ పోన్ చేస్తున్నాడు. అప్పట్లో బాహుబలి సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇప్పుడడిగితే మళ్లీ సాహో సినిమా తర్వాతే పెళ్లంటున్నాడని కృష్ణంరాజు చెప్పారు. ఇక ప్రభాస్ విషయానికొస్తే.. తన పెళ్లి విషయం తన వ్యక్తిగతమని.. దాని గురించి అందరూ మాట్లాడటం తనకు ఇష్టం లేదని అన్నాడు. 
 
అంతేకాకుండా.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు. ఇంకేముంది..? సాహో సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదలైన తర్వాతైనా.. ప్రభాస్ పెళ్లిపీటలెక్కుతాడో లేదో వేచి చూడాలి.