శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. రైల్వే బడ్జెట్ 2014 - 15
Written By PNR
Last Updated : మంగళవారం, 8 జులై 2014 (13:32 IST)

చెన్నై - హైదరాబాద్‌ల మధ్య బుల్లెట్ రైల్ : సదానంద గౌడ!

చెన్నై - హైదరాబాద్‌ల మధ్య సెమీ బుల్లెట్ రైలును ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ సోమవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో పేర్కొన్నారు. అలాగే, కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వేల అభివృద్ధికి ప్రత్యేక కమిటీని నియమించినట్టు చెప్పారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అక్కడ రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రూ.20,680 కోట్ల కేటాయించినట్లు చెప్పారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రైల్వేల అభివృద్ధికి తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 29 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నట్లు చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. 
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించిన కొత్త రైళ్ళ వివరాలు ఇవే... 
 
సికింద్రాబాద్ - నాగపూర్ సెమీ బుల్లెట్ రైలు 
చెన్నై - హైదరాబాద్ మధ్య సెమీ బుల్లెట్ రైలు 
సికింద్రాబాద్ - నిజాముద్దీన్ ప్రీమియం రైలు 
విశాఖ - చెన్నై మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు 
పారాదీప్ - విశాఖల మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు 
విజయవాడ - ఢిల్లీ మధ్య ఏపీ ఎక్స్‌ప్రెస్ కొత్త రైలు 
సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రీమియం రైలు.