శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2019 (14:14 IST)

అన్నం తిన్నట్టు కల వస్తే..?

కలలు మానవ నైజం, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలలు కంటారు. మనమిప్పుడు మాట్లాడుకునేది జీవితంలో ముందుకు ఎలా ఎదగాలో, ఎటువంటి పనులను చేపట్టాలోనని పథకాలు వేసుకునే పగటి కలలను గురించి కాదు.. మనం ఇప్పుడు మాట్లాడుకునేది నిద్రపోయే సమయంలో కనులు కనే కలలను గురించి. 
 
కలల స్వరూపం ఏమిటని ప్రశ్నించుకుంటే వచ్చే జవాబు.. అవి మన మానసిక స్థితికి ప్రతిరూపాలేనని సంతోషంగా ఉండేటప్పుడు పడుకుంటే వచ్చే కలలు ఒకలా ఉంటాయి. ఇదే విషాదంగా ఉన్నప్పుడు పడుకుంటే వచ్చే కలలు మరోలా ఉంటాయి. మరి ఆ కలల్లో కనిపించే పలు దృశ్యాలు మనకేమి చెబుతున్నాయి? వాటి వలన వచ్చే లాభనష్ట ఫలితాలు ఏమిటనే విషయాలను మనమిప్పుడు తెలుసుకుందాం. మన కలల్లో కనిపించే ఎలాంటి దృశ్యాలు, వినే శబ్దాలు ఎటువంటి ఫలితాలకు దారితీస్తాయో తెలుసుకుందాం..
 
మెరుపు మెరిసినట్లు, ఉరుములు ఉరిమినట్లు, పిడుగు పడినట్లు, తల దువ్వుకుంటున్నట్లు, ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్లు, కుక్క తమను చూచి మొరిగినట్లు, నక్క, కోతి కనిపించినా, పక్షిగుడ్లను పగులగొట్టినట్లు, తడిసి ఉన్న గోడపై నడిచినట్లు, తేనెటీగలు కుట్టినట్లు, ఎగురుతున్నట్లు, మృతులను చూసినట్లు, గుడ్లగూబలు అరిచినట్లు, చెట్టు ఎక్కి అన్నం తిన్నట్టు కలలు వచ్చినా నిజ జీవితంలో మంచి జరుగదని నిపుణులు చెప్తున్నారు.
 
ఇవే కాకుండా.. పరిచయం లేని స్త్రీతో వెళ్ళుతున్నట్లు, దిగంబరంగా ఉన్నట్లు, పిల్లలు మరణించినట్లు, సూర్యాస్తమయం, మబ్బుల వెనుకనున్న సూర్యుడు, సూర్యకిరణాలు తమ పక్క మీద పడినట్లు, ఎర్రని పూలు, ప్రత్తి చెట్లు, పూలు పూయని చెట్లు, చుట్టూ గ్రద్దలు ఎగురుతున్నట్లు, ముఖంపై పక్షులు పొడిచినట్లు, క్రింద పడిన ఆకులు, వక్కలను ఏరుకున్నట్లు, గడ్డం, మీసం గొరిగించుకున్నట్లు, నారింజ, నిమ్మ, పనసకాయలు తిన్నట్లు స్వప్నాలు రావడం మంచిది కాదట.