తాంబూలం ప్రాముఖ్యత: కఫము.. వాతము గోవిందా!
నోములు, వ్రతాల సమయంలోను పేరంటాళ్లకు వాయనాలతో తాంబూలాన్ని ఇవ్వడం ఆచారంగా వస్తోంది. తాంబూలానికి ఇంతటి ప్రాముఖ్యత ఇచ్చే ఆచారానికి వెనుక అసలైన అర్థం లేకపోలేదు. సాధారణంగా భోజనం అనంతరం వేసుకునే తాంబూలంలో వక్కలు, సున్నం, పచ్చ కర్పూరం, జాజికాయ, లవంగాలు, కాసు, ఏలకులు వంటివి కనిపిస్తుంటాయి. తమలపాకుల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగివున్నాయి.
తాంబూలాన్ని స్వీకరించడం వలన కఫము వాతము హరించుకు పోతాయి. నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, కడుపులోని క్రిములను సైతం ఇది నశింపజేస్తుంది. నాలుకను శుభ్రపరచడమే కాకుండా, దంతవ్యాధులను గొంతుకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది.
తాంబూలాన్ని మితంగా సేవించడం వలన అది ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధంగా పనిచేస్తోందని శాస్త్రం చెబుతోంది. ఈ కారణంగానే పెద్దలు తమ తరువాత తరాల వారికి తాంబూలంతో విడదీయరాని సంబంధాన్ని ఏర్పరిచారని చెప్పొచ్చు.