శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Modified: శనివారం, 16 జులై 2016 (22:08 IST)

తిరుమల శ్రీవారికి రూ. 2 కోట్ల విరాళం... చెన్నైకి చెందిన భక్తులు

తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన ప్రసాదం ట్రస్టుకు శనివారం రూ. 2 కోట్లు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన టివిఎస్‌ మోటార్స్ సంస్థ ప్రెసిడెంట్‌, సిఈఓ కె.ఎన్‌.రాధాక్రిష్ణన్‌ ఒక కోటి రూపాయలు, చెన్నైకి చెందిన సుందరం క్లేటన్‌ లిమిటెడ్‌ సంస్థ సిఈఓ పి.

తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన ప్రసాదం ట్రస్టుకు శనివారం రూ. 2 కోట్లు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన టివిఎస్‌ మోటార్స్ సంస్థ ప్రెసిడెంట్‌, సిఈఓ కె.ఎన్‌.రాధాక్రిష్ణన్‌ ఒక కోటి రూపాయలు, చెన్నైకి చెందిన సుందరం క్లేటన్‌ లిమిటెడ్‌ సంస్థ సిఈఓ పి.ఎ.రంగనాథన్‌లు కోటి రూపాయలు అందించారు.
 
శ్రీవారి ఆలలయంలోని రంగనాయకుల మండపంలో ఈఓ సాంబశివరావును కలిసిన దాతలు విరాళాలను డిడిలను అందజేశారు. ఈ సంధర్భంగా దాతలకు తితిదే ఈఓ ప్రసాదాలను అందజేశారు.