1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : శనివారం, 14 మే 2016 (11:05 IST)

తిరుపతిలో దొరవేషంలో కైకాల కులస్థుల సందడి

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. వేషధారణలో భాగంగా శనివారం కైకాల కులస్థులు వంశపారపర్యంగా దొరవేషాన్ని ధరించారు. అలాగే చాకలి కులస్థులు మంత్రి వేషాన్ని ధరించారు. వీరు మంత్రి, దొరవేషాలతో నగరమంతా తిరుగుతూ పూజలందుకున్నారు. నాడు గంగమ్మ సంచరించిన దానికి చిహ్నంగా నేడు కైకాల,  చాకలి కులస్థులు ఆనవాయితీగా గంగమ్మకు ఇష్టమైన ఈ వేషాన్ని ధరించి అమ్మను సంతోష పరుస్తారు.
 
ఇక భక్తులు కూడా బొగ్గుతో నల్లటి బొట్లు ధరించి, తెల్లటి నామాన్ని శరీరంపై పూసుకుని, చేతిలో వేపాకు పెట్టుకుని పట్టణంలో కనిపించిన వారిని బూతులు తిట్టుకుంటూ గంగమ్మ ఆలయానికి చేరుకుంటున్నారు. శనివారం ఉదయం నుంచే ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది.