Daily Horoscope
✕

చిదంబ‌ర ర‌హ‌స్యం మీకు తెలుసా? మ‌న దేహానికి, దేవాల‌యానికి సంబంధం...

త‌మిళనాడులోని చిదంబరంలో గొప్ప దేవాలయం ఉందనీ, అక్కడున్న నటరాజ విగ్రహం ప్రపంచ ప్రసిద్ధమైనదని మనలో చాలామందికి తెలుసు. కానీ, ఆ చిదంబ‌రంలోని ర‌హ‌స్యాలేంటో మీకు తెలుసా? చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అన

Written By JSK
Updated: బుధవారం, 2 నవంబరు 2016 (12:47 IST)
త‌మిళనాడులోని చిదంబరంలో గొప్ప దేవాలయం ఉందనీ, అక్కడున్న నటరాజ విగ్రహం ప్రపంచ ప్రసిద్ధమైనదని మనలో చాలామందికి తెలుసు. కానీ, ఆ చిదంబ‌రంలోని ర‌హ‌స్యాలేంటో మీకు తెలుసా? చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం శాస్త్ర‌వేత్త‌లు తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తన గ్రంధం "తిరుమందిరం"లో ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమూలర్ వివ‌రించారు.


చిదంబ‌రంలోని ఈ ఆలయం ప్రపంచ అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది. పంచ భూతాలు అని మనం చెప్పుకునే భూమి, ఆకాశమూ, వాయువూ, నీరు, అగ్నిలలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అనీ, కాళహస్తి వాయువుకు ప్రతీక అనీ, కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వి(భూమి)కి ప్రతీక అనీ అంటారు. 
 
అయితే ఇక్కడ అద్భుతం ఏమిటంటే, ఈ మూడు దేవాలయాలూ ఒకే రేఖాంశం మీద ఉన్నాయి. మాన‌వుడికి న‌వ రంధ్రాలు ఉన్న‌ట్లు ... చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మానవుడు రోజుకు 21600 సార్లు గాలి పీలుస్తాడు. ( 15 x 60x 24 = 21600). చిదంబరం దేవాలయంలో పైన 21,600 బంగారపు రేకులు తాపడం చేశారు. ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72,000 బంగారపు మేకులు వాడారు. మన శరీరంలో ఉండే నాడులు 72,000 అని ఆయుర్వేదం చెబుతుంది.
 
చిదంబ‌రం దేవాలయంలో "పొన్నాంబళం" కొంచెం ఎడమ వైపున‌కు ఉంటుంది. అది మన హృదయ స్థానం. అక్కడకి వెళ్ళడానికి "పంచాక్షర పడి" ఎక్కాలి. అది న+మ+శి+వ+య పంచాక్షరిని సూచిస్తుంది. "కనక సభ"లో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబళంలో 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు - శివారాధనా పద్ధతులు. ఇవి 64X64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి. 64 కళలు ఉన్నాయని రుజువు ఇది. 
 
అంతేకాదు అడ్డు దూలాలు రక్తప్రసరణ నాళాలు. 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. అర్ధ మంటపంలోని 6 స్తంభాలూ 6 శాస్త్రాలకు ప్రతీకలు. ప‌క్కన ఉన్న మంటపంలోని 18 స్తంభాలూ 18 పురాణాలకి ప్రతీకలు. నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్టులు కాస్మిక్ డాన్సు అని వర్ణించారు. మూలవర్ చెప్పిన ఈ విషయాలు శాస్త్ర సమ్మతాలని నిరూపించడానికి పాశ్చాత్య పరిశోధకులకు 8 సంవత్సరాలు పట్టింది.

అన్నీ చూడండి

Weather Forecast: నవంబర్ 22, 2026న తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంటుందంటే..?

అనిరుధ్-కావ్య మారన్ రిసెప్షన్‌కు హాజరైన మంత్రి నారా లోకేష్ కుటుంబం

అనిరుధ్-కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్లో విజయ్-రజినీకాంత్-స్టాలిన్

హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవ రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్‌బీఎల్‌ లెగసీ

హైదరాబాద్ నగరానికి అప్పుడేమో మెస్సీ.. ఇప్పుడు రొనాల్డో.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?

డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్‌కు పాలీహెర్బల్ యాంటీ డయాబెటిక్ ఫార్ములా : ఎస్ఆర్ఎంటీ వెల్లడి

సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్

చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు

మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?

తర్వాతి కథనం
Show comments