నోరూరించే నువ్వుల లడ్డూ తయారీ ఎలా?

బుధవారం, 27 జనవరి 2016 (14:54 IST)
భారతీయ వంటకాల్లో చాలా అరుదుగా వినియోగించే పదార్థాల్లో నువ్వులు ఒకటి. వీటిని కేవలం పండుగల సమయాల్లో మాత్రమే ఎక్కువగా వాడుతారు. వీటితో తయారుచేసే ఆహారాలు ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది. నువ్వుల్లో ఫ్లేవనాయిడ్, ఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, డైటేరియన్ ఫైబర్ వంటివి పుష్కలంగా దొరుకుతుంది. ఇన్ని పోషకాలు కలిగిన ఈ నువ్వులు డయాబెటిస్, ఓరల్ హెల్త్, జలబు, చుండ్రు, చర్మ తదితర సమస్యలను తగ్గించడంలో కీలకపాత్రను పోషిస్తుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఈ నువ్వులతో లడ్డూలు చేసుకుని తింటే ఎంతో శ్రేయస్కరం. మరి.. వాటిని ఎలా చేస్తారో తెలుసుకుందామా.
 
కావలసిన పదార్థాలు :
నల్లనువ్వులు - 1 కప్పు 
బెల్లం - అరకప్పు 
ఖర్జూరం - అరకప్పు
జీడిపప్పు - అరకప్పు 
ఎండు ద్రాక్ష -  అరకప్పు 
ఎండుకొబ్బరి తురుము - 1/4 కప్పు 
వేరుశెనగపప్పు- అరకప్పు 
యాలకులు - తగినంత 
నెయ్యి - తగినంత 
 
తయారు చేసే విధానం :
ముందుగా స్టౌవ్ మీద పాత్ర పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడిచేయాలి. వేడైన తర్వాత అందులో నువ్వులు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదేపాత్రలో వేరుశెనగపప్పు, జీడిపప్పు కూడా విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించి పెట్టుకున్న నువ్వులు, వేరు శెనగపప్పు, జీడిపప్పులను మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. అలాగే యాలకులు, బెల్లం కూడా పొడి చేసుకోవాలి. 
 
ఇప్పుడు ఖర్జూరం మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఖర్జూరం ముద్దలో నువ్వుల పొడి, పల్లీలతో చేసిన పొడి, బెల్లంపొడి, కొబ్బరి తురుము కూడా వేసి కలపాలి. తర్వాత చేతికి కరిగించిన నెయ్యి రాసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఉండల్లా చేసుకోవాలి. వీటిని గాలి తగలని డబ్బాలోకి తీసుకుంటే 15 రోజుల వరకూ నిల్వ ఉంటాయి. అంతే తియ్యనైన నువ్వుల లడ్డులు రెడీ. 

అన్నీ చూడండి

అబ్బబ్బా.. ఏపీ అంతా మోసం, కుంభకోణాలు, అక్రమాలతో పాలన సాగుతోంది.. జగన్

బీహార్ రాబరీ గర్ల్స్, నగల దుకాణంలో యజమాని కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి దోపిడీ యత్నం, వీడియో

పెళ్లి చేసుకోమన్న యువతి.. మత్తిచ్చి ఊపిరాడకుండా చేసి చంపేశారు...

కాకినాడ : జ్యూస్‌లో నిద్రమాత్రలిచ్చి భర్తను చంపేసిన భార్య

ప్రతికూల వాతావరణం.. హైదరాబాద్‌కు రావాల్సిన తొమ్మిది విమానాల దారి మళ్లింపు

అన్నీ చూడండి

మళ్లీ కలిసి జీవించనున్న విజయ్ - సంగీత..? త్రిష పరిస్థితి ఏంటి?

వామ్మో అదేం స్పీడ్... 82 యేళ్ల వయసులో కూడా అదే జోష్‌తో అమితాబ్ వర్క్

Michael Jackson: మైఖేల్ జాక్సన్ బయోపిక్.. రికార్డ్ బ్రేక్

Satyadev: బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ అంత గర్వపడే చిత్రంగా రావు బహదూర్ : సత్యదేవ్

Deva Katta : ఇతర సినిమాకు పనిచేయడంలేదంటూ దర్శకుడు దేవా కట్టా స్పష్టత

Show comments