Festival Posters
✕

మైదాతో తీపి బజ్జీలు

Written By Ganesh
Updated: శుక్రవారం, 23 జనవరి 2009 (19:29 IST)
కావలసిన పదార్థాలు :
మైదాపిండి... పావుకేజీ
చక్కెర పొడి... పావుకేజీ
పెరుగు... రెండు కప్పులు
ఉప్పు... సరిపడా
పచ్చిమిర్చి... ఆరు
పెద్ద ఉల్లిపాయలు... రెండు
జీలకర్ర... ఒక టీస్పూన్
అల్లం... చిన్న ముక్క
కరివేపాకు... రెండు రెబ్బలు
నూనె... పావు కేజీ

తయారీ విధానం :
మైదా పిండిని శుభ్రంగా జల్లించుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లంలను సన్నగా తరిగి ఉంచుకోవాలి. మైదాపిండితో పాటు పైన తరిగి ఉంచుకున్న ముక్కలు, పెరుగు, ఉప్పు, జీలకర్ర, చక్కెర పొడి వేసి బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి.

ఈ పిండిని నాలుగు గంటలపాటు నానబెట్టాలి. తరువాత పొయ్యిమీద బాణలి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. నూనె కాగుతుండగా చిన్న చిన్న బోండాల లాగా (పునుగులు) వేసి బంగారు వర్ణం వచ్చేదాకా కాల్చి తీయాలి. అంతే మైదాతో తయారైన తీపి బజ్జీలు సిద్ధమైనట్లే..!

తియ్య తియ్యగా, కాస్తంత కారంగా ఉండే ఈ వెరైటీ బజ్జీలు మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. కావాలంటే, మీరూ ఒకసారి ప్రయత్నించి చూడండి మరి..! తీపి వద్దనుకునేవాళ్ళు చక్కెర పొడి తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బజ్జీలను చేసుకోవచ్చు. వీటికి అల్లం చట్నీని సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.
About Author
Ganesh
contractDetail: Webdunia Chennai.... Read More

అన్నీ చూడండి

మెజార్టీ తగ్గిందని తిట్ల దండకం.. బూతులు వినలేక చీరలు వెనక్కి ఇచ్చిన ఓటర్లు (వీడియో)

ఎంపీ సీట్లు పెరిగితే భారత్‌లో ప్రజాస్వామ్యం అంతమైపోతుంది : రాహుల్ (Video)

డీ-లిమిటేషన్ బిల్లుపై వెనకడుగు లేదు : సోనియా బృందానికి స్టాలిన్ స్పష్టీకరణ

డీలిమిటేషన్ బిల్లు పాస్ అయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్?

హర్యానాలో రౌడీ ముఠాతో సహా నలుగురి కాల్చివేత

అన్నీ చూడండి

అలాంటి భర్త ఉండాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది : రేణూ దేశాయ్ (Video)

ఆటో జానీ గుర్తున్నాడా... ఈ సంక్రాంతికి మీ ముందుకు వస్తున్నాడు...

AA23: రచయిత అప్‌డేట్‌తో అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌కు ఊపు

Akhil Japan : జపాన్ లో అఖిల్ అక్కినేనిపై అమితమైన ప్రేమ ప్రదర్శన

Tabitha sukumar : ఇడుపు కాయితం లో ఉల్లిపూల సాంగ్ కోసం తబిత అక్క ఎంతో తపన పడ్డారు : ప్రియదర్శి

Show comments