గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కేసీఆర్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 అక్టోబరు 2022 (14:51 IST)

శృంగార సమయంలో కండోమ్స్ ఎక్కువగా వాడేది ముస్లింలే : ఎంపీ అసదుద్దీన్

asaduddin
భార్యాభర్తలు శృంగార సమయంలో కండోమ్స్‌ను అత్యధికంగా వినియోగించేది ముస్లింలేనని హైదరాబాద్ ఎంపీ, ఐఎంఐం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. దేశంలో ముస్లిం జనాభా పెరిగిపోతుందంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ముస్లింల సంతానోత్సత్తి తగ్గిపోతుందని ఆయన గుర్తుశారు. పైగా, ఖురాన్ చదవాలంటూ మోహన్ భగవత్‌కు ఓ సలహా ఇచ్చారు. 
 
ఇటీవలి కాలంలో దేశంలో ముస్లిం జ‌నాభా పెరుగుతోంద‌ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తాజాగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ముస్లింల సంతానోత్పత్తి రేటు పెర‌గ‌డం లేద‌ని పడిపోయింద‌ని చెప్పారు. 
 
'బాధపడకండి, ముస్లిం జనాభా పెరగడం లేదు, తగ్గుతోంది. కండోమ్‌లు ఎవరు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? మేమే. మోహన్ భగవత్ దీనిపై మాట్లాడరు' అని అసదుద్దీన్ ఒవైసీ ఒక సభలో చెప్పారు. 
 
బుధవారం మోహన్ భగవత్ 'జనాభా అసమతుల్యత' సమస్యను లేవనెత్తుతూ, అన్ని సామాజిక వర్గాలకు సమానంగా వర్తించే విధంగా బాగా ఆలోచించి, సమగ్ర జనాభా నియంత్రణ విధానం కోసం పిలుపునిచ్చారు. కమ్యూనిటీ ఆధారిత జనాభా అసమతుల్యత అనేది ఒక ముఖ్యమైన అంశమ‌ని, దాన్ని విస్మరించరాదని కూడా ఆయన అన్నారు.