శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 18 అక్టోబరు 2021 (09:06 IST)

జనాభా నియంత్రణ విధానాన్ని తీసుకురావాలి: మోహన్‌ భగవత్‌

భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్ భగవత్‌ ఆరోపించారు.

విజయదశమి సందర్భంగా నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అనంతరం సంఘ్‌ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.

పాకిస్థాన్‌, తాలిబన్‌, ఉగ్రవాదం నుంచి జనాభా నియంత్రణ వరకు పలు అంశాలపై మాట్లాడారు. ఆరెస్సెస్‌ ఏటా నిర్వహించే ఈ వేడుకలకు ఈసారి ఇజ్రాయెల్‌ కాన్సులేట్‌ జనరల్‌ కొబ్బి షొషానీ అతిథిగా హాజరయ్యారు. 
 
ఆయన ప్రసంగంలోని కీలకాంశాలు..
జనాభా నియంత్రణ విధానాన్ని మరోసారి తీసుకురావాల్సిన అసవరం ఉంది. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని దాన్ని రూపొందించాలి. ఇది అందరికీ సమానంగా వర్తింపజేయాలి. జనాభా అసమతుల్యత పెద్ద సమస్యగా మారింది. జమ్మూకశ్మీర్‌లో ప్రజల్ని భయపెట్టడం కోసం ఉగ్రవాదులు హింసను ఆశ్రయిస్తున్నారు. ఓటీటీ వేదికలపై నియంత్రణ లేకుండా పోయింది. కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత పిల్లల దగ్గర కూడా ఫోన్లు ఉంటున్నాయి.