Daily Horoscope
✕

School bus: సైకిల్‌పై రోడ్డుపైకి బాలుడు... స్కూల్ బస్సు టైర్ కిందపడి మృతి (video)

Written By సెల్వి
Updated: శనివారం, 21 జూన్ 2025 (14:42 IST)
Cycle Boy
పిల్లల పట్ల తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా దారుణ ఘటనలు జరుగుతున్నాయి. పిల్లలకు సైకిల్స్ ఇచ్చి రోడ్లపైకి పంపడంలో ఎంత సేఫ్టీ వుంటుందో ఆలోచించట్లేదు. పిల్లలు సైకిళ్లను రోడ్డపై నడపటం తప్పు కాదు కానీ.. రోడ్లు సరిగ్గా లేకపోవడం, అతివేగంగా ఇతర వాహనాలు నడవడం కారణంగా ఏర్పడే ప్రమాదాలతో చిన్నారుల బలైపోతున్న దాఖలాలు ఎన్నో వున్నాయి. రోడ్లు సరిగ్గా లేకపోవడం కారణంగా ఓ బాలుడు దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 
 
అల్విన్ కాలనీలో ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కిందపడి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ ఘటన రికార్డ్ అయ్యింది. ఆ వీడియోలో పదేళ్ల బాలుడు జయశిత్ చౌహాన్ సైకిల్ తొక్కుతూ కిందపడిపోగా.. అదే సమయంలో బాలుడి పైకి స్కూలు బస్సుకొచ్చింది. 
 
తేరుకునే లోపై స్కూల్ బస్సు మొదటి టైర్ బాలుడిపై ఎక్కిదిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆ బాలుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

అన్నీ చూడండి

Kiran Abbavaram Record : సుకుమార్‌ రైటింగ్స్‌లో కిరణ్‌ అబ్బవరం చిత్రం రికార్డ్‌ అవుతుందా !

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లిపోతున్న అనుష్క శెట్టి.. కారణం ఏంటి?

రమేష్ బాబు చెరుకూరు చేసిన సిద్ధుగాడి లవ్ స్టోరీ సిద్ధమైంది

అటు భారత్, ఇటు పాక్. సైనికుడు నేపథ్యంతో ది ఇండియన్ బార్డర్

Naga chaitnya : పురాతన కాలంలో రహస్యాలతో కొత్త ప్రపంచాన్ని చూపించనున్న వృషకర్మ

తర్వాతి కథనం
Show comments