శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2024 (22:08 IST)

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

snatching
snatching
హైదరాబాదులో పట్టపగలే చైన్ స్నాచింగ్ జరిగింది. కాలింగ్ బెల్ కొట్టి మరీ ఎవరైనా చూస్తారనే భయం లేకుండా చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. కాలింగ్ బెల్ కొట్టి మరీ ఎవరైనా చూశారనే భయం లేకుండా చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. మొదటి అంతస్తులో గుర్తు తెలియని ఓ వ్యక్తి ముఖానికి మాస్క్‌ ధరించి వచ్చి.. ఫ్లాట్ ముందు అటూ ఇటూ తిరుగుతూ.. కాలింగ్ బెల్ కొట్టాడు.
 
అప్పటికే నిద్రలో ఉన్న మహిళ.. కాసేపటికి తలుపులు తెరవగా.. ఆ మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసును సదరు వ్యక్తి ఎత్తుకెళ్లాడు. దీంతో మహిళ లబోదిబోమంటూ దొంగ వెంట పరుగులు తీసింది. 
 
ఈ ఘటన సీసీటీవీలో రికార్డవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.