ఏఐ ఆవిష్కరణ, క్వాలిటీ ఇంజినీరింగ్, మూడవ కేంద్రంను హైదరాబాద్‌లో ప్రారంభించిన క్వాలీజీల్
క్వాలిటీ ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తన సేవలలో అంతర్జాతీయంగా అగ్రగామి అయిన క్వాలీజీల్, హైదరాబాద్‌లో తమ కొత్త సమర్ధత కేంద్రంను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ జోడింపుతో, క్వాలీజీల్ ఇప్పుడు భారతదేశంలో మూడు సామర్థ్య కేంద్రాలను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తోన్నట్లయింది. 2021లో తమ కార్యకలాపాలన ప్రారంభించినప్పటి నుండి దాని అద్భుతమైన వృద్ధికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఈ వ్యూహాత్మక విస్తరణ, శ్రేష్ఠత పట్ల సంస్థ యొక్క అంకితభావం, ఆవిష్కరణ కోసం దాని ప్రయత్నం, డిజిటల్ పరివర్తనలో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలనే దాని నిబద్ధతను వెల్లడిస్తుంది.
"హైదరాబాద్ సామర్ధ్య కేంద్రం, ఆవిష్కరణలను నడపడం, నాణ్యమైన ఫలితాలను అందించడంలో మా అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం" అని క్వాలీజీల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్- సీఈఓ కళ్యాణ్ కొండా అన్నారు. "ఈ విస్తరణ సాంకేతికత, ప్రతిభకు అంతర్జాతీయ కేంద్రంగా భారతదేశం యొక్క సామర్ధ్యం పై మా నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది, మా ఖాతాదారులకు మెరుగైన సేవలందించడానికి, డిజిటల్ పరివర్తన ప్రదేశంలో మా వృద్ధిని వేగవంతం చేయడానికి మాకు వీలు కల్పిస్తుంది" అని అన్నారు.
హైదరాబాద్ కెపాబిలిటీ సెంటర్ యొక్క ముఖ్యాంశాలు:
ఏఐ -ఆధారిత పరీక్ష సేవలు: QMentisAI వంటి అధునాతన జెన్ ఏఐ -ఆధారిత సాధనాలు వర్క్‌ఫ్లోలను విప్లవాత్మకంగా మార్చడానికి మరియు నిరంతర నాణ్యత మెరుగుదలని నిర్ధారించడానికి తోడ్పడతాయి.
ఆవిష్కరణ, సహకారం: మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ వంటి అత్యాధునిక సాంకేతికతల ద్వారా పరివర్తన పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఒక కేంద్రంగా నిలువనుంది.
కీలక పరిశ్రమలపై వ్యూహాత్మక దృష్టి: ట్రావెల్, బిఎఫ్ఎస్ఐ, హెల్త్‌కేర్, రిటైల్ రంగాలకు సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవడానికి, కొలవగల విలువను అందించడానికి తగిన పరిష్కారాలు అందిస్తుంది.
మధు మూర్తి, కో-ఫౌండర్ & హెడ్ ఆఫ్ ఇండియా ఆపరేషన్స్, క్వాలిజీల్ మాట్లాడుతూ, “మా హైదరాబాద్ కేంద్రం కేవలం భౌతిక విస్తరణ కంటే ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తుంది; ఇది సహకారం, ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించాలనే మా ఆశయాన్ని ప్రతిబింబిస్తుంది. అధునాతన ఏఐ-ఆధారిత పరిష్కారాలను ఏకీకృతం చేయడం ద్వారా, మేము వేగంగా మార్కెట్‌కి తీసుకువెళ్లడం, ఖర్చు పరంగా ఆదా మరియు అసాధారణమైన నాణ్యతను సాధించడానికి పరిశ్రమల అంతటా వ్యాపారాలకు సాధికారత కల్పిస్తున్నాము.." అని అన్నారు.