1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (18:04 IST)

Lasya Nanditha లాస్యను వెంటాడిన మృత్యువు, రెండుసార్లు తప్పుకున్నా 3వ సారి ఓడిపోయిన నందిత

Lasya Nandita
కర్టెసి-ట్విట్టర్
సికిందరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య(Lasya Nanditha)ను మృత్యువు వెంటాడింది. రెండుసార్లు తప్పించుకున్నా మూడోసారి లాస్య నందిత ఓడిపోయారు. సంగారెడ్డిలోని సుల్తాన్‌పూర్ ఓఆర్‌ఆర్‌లో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించారు. నిన్న రాత్రి సదాశివపేటలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
 
నందితను మృత్యువు ఇప్పటికే రెండుసార్లు వెంబడించింది. డిసెంబరు నెలలో ఓవర్‌లోడ్ కారణంగా లిఫ్ట్ ఆరు అడుగుల ఎత్తు నుంచి కూలిపోయిన ఘటనలో ఆమె అందులో ఇరుక్కుపోయింది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. ఫిబ్రవరి 13న మాజీ సీఎం కేసీఆర్‌ సభకు హాజరయ్యేందుకు నల్గొండ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచోసుకున్నది. ఐతే ఈ ప్రమాదంలో లాస్య బయటపడ్డారు కానీ హోంగార్డు ఒకరు మృతి చెందాడు.
 
కానీ ఈరోజు లాస్యకు అదృష్టం కలిసిరాలేదు. మూడోసారి జరిగిన ప్రమాదంలో ఆమె మృత్యువాత పడ్డారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన లాస్య తండ్రి సాయన్న గత ఫిబ్రవరిలో మరణించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.