గురువారం, 24 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 ఏప్రియల్ 2025 (14:44 IST)

అమ్మాయిలను ఎరవేసి అబ్బాయిలకు గాలం.. రూ.వేలల్లో బిల్లులు వసూలు?

pubhyd
హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్‌పై ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 16 మంది అమ్మాయిలతో పాటు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే డీజే ఆపరేటర్, పబ్ మేనేజర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. 
 
దీనిపై చైతన్యపురి సీఐ వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ, స్టేషన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా వైల్డ్ హారట్స్ పబ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. పబ్‌లోకి ఉచిత ప్రవేశాలు కల్పిస్తూ, అమ్మాయిలను ఎరవేసి, ఒక్కొక్కరి నుంచి వేలాది రూపాయలను వసూలు చేస్తున్నారని వెల్లడించారు. 
 
పబ్‌కు వచ్చిన యుకుల వద్దకు అమ్మాయిలను పంపుతూ, వారితో అశ్లీల నృత్యాలు చేయిస్తూ, ఎక్కువ మద్యం తాగేలా చేస్తూ అధిక మొత్తంలో బిల్లులు వసూలుచేస్తున్నట్టు సీఐ తెలిపారు. దీనికి సంబంధించి 16 మంది అమ్మాయిలతో పాటు డీజీ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పబ్ యజమాని రాము, మేనేజర్ సంతోష్‌లు పరారీలో ఉండగా, వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.