శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జనవరి 2025 (12:16 IST)

YS Abhishek Reddy: జగన్ బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూత

Abhishek Reddy
Abhishek Reddy
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంధువు, సన్నిహితుడు వైఎస్ అభిషేక్ రెడ్డి హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో కొద్దిసేపటికే తుది శ్వాస విడిచారు. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అభిషేక్ రెడ్డి మృతి చెందారు. ఆయన బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అభిషేక్‌రెడ్డి మరణంతో వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

బుధవారం పులివెందులలో అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం. ఈ అంత్యక్రియలకు జగన్‌తో సహా వైఎస్ కుటుంబ సభ్యులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

వృత్తిరీత్యా వైద్యుడు, అభిషేక్‌ జగన్‌కు అత్యంత సన్నిహితుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ)కి లింగాల మండల ఇన్‌చార్జిగా పనిచేశారు. డప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్​ రెడ్డి అన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడే వైఎస్​ అభిషేక్‌రెడ్డి.

గత ఎన్నికల్లో అభిషేక్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. లింగాల మండలానికి అభిషేక్ రెడ్డి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహారించారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అభిషేక్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది.