మల్లాపూర్‌లో చెత్త ఊడ్చే వాహనం బీభత్సం.. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో? (video)
హైదరాబాద్ నగరంలోని మల్లాపూర్‌లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కి చెందిన చెత్త ఊడ్చే వాహనం బీభత్సం సృష్టించింది. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వాహనాన్ని ఆపే క్రమంలో జీహెచ్‌ఎంసీ వాహన డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. చెత్త ఊడ్చే వాహనాన్ని డ్రైవర్ రోడ్డుపై నిలిపి ఉంచాడు.
హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో వాహనం ముందుకు కదిలింది. దీంతో అదుపు తప్పి ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.