బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 జనవరి 2025 (19:42 IST)

Telangana: తెలంగాణ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల

voters
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సవరించిన ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,35,27,925గా ఉంది. వీరిలో పురుష ఓటర్లు 1,66,41,489 మంది, మహిళా ఓటర్లు 1,68,67,735 మంది, థర్డ్ జెండర్‌కు చెందిన వారు 2,829 మంది ఉన్నారు.  
 
18-19 సంవత్సరాల మధ్య వయస్సు గల ఓటర్ల సంఖ్య 5,45,026 కాగా, 2,22,091 మంది ఓటర్లు 85 ఏళ్లు పైబడిన వారు. ఈ జాబితాలో 3,591 మంది ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌ఐ) ఓటర్లు, 5, 26,993 మంది ఓటర్లను ప్రత్యేక సామర్థ్యం గల వ్యక్తులుగా గుర్తించారు.
 
 
 
అన్ని నియోజకవర్గాల్లో అత్యధికంగా సేరిలింగంపల్లిలో 7,65,982 మంది ఓటర్లు నమోదు కాగా, అత్యల్పంగా భద్రాచలంలో 1,54,134 మంది ఓటర్లు ఉన్నారు.