మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జనవరి 2025 (10:22 IST)

కేసీఆర్ ఫ్యామిలీ వెయ్యేళ్లు జైలుశిక్ష అనుభవించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy
గత తొమ్మిదేళ్ల భారత రాష్ట్ర సమితి పాలనలో ఏం జరిగిందో తవ్వి తీస్తే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా ఆయన కుటుంబ సభ్యులంతా వెయ్యేళ్లపాటు జైలు జీవితం గడపాల్సి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, గతంలో ఏం జరిగిందనే విషయంపై వెనక్కి వెళితే కేసీఆర్ కుటుంబం వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందన్నారు. 
 
ఓ మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు సీఎం పైవిధంగా స్పందించారు. గతంలో ఏం జరిగిందనే విషయాలను పక్కన పెట్టి... భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా... నిజమైన రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికలకు ముందు ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ప్రస్తుత వెసులుబాటు, ఆర్థిక పరిస్థితిని బట్టి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయినా గతంలో ఉన్న రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచినట్లు చెప్పారు.