నేను రాష్ట్రాన్ని శాసిస్తున్నా, కావాలనే చిన్నపీటపై కూర్చున్నా: భారాసకి భట్టి కౌంటర్
యాదాద్రి ఆలయానికి వెళ్లినప్పుడు పూజాది కార్యక్రమాలు నిర్వహించిన సమయంలో సీఎం రేవంత్ ఆయన సతీమణి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెంచిపై కూర్చుని నిర్వహించారు. అదేసమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంచి పక్కనే చిన్న పీటపై కూర్చుని పూజలు నిర్వహించారు. ఈ పూజా ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు. వాటిని చూసిన భారాస ప్రతిపక్ష నాయకులు కొందరు... ఉపముఖ్యమంత్రి భట్టికి ఘోర అవమానం అంటూ కామెంట్లు చేసారు. దళితుడని కింద కూర్చోబెట్టారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేసారు. దీనిపై భట్టి విక్రమార్క స్పందించారు.
తను ఉపముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తున్నాననీ, తను ఎవరికీ తలవంచేవాడిని కాదని అన్నారు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునేవాడిని కూడా కాదన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకునే తత్వం తనది కాదనీ, తను కావాలనే చిన్నపీటపై కూర్చుని పూజలు చేసినట్లు వెల్లడించారు.