Baby Girl: ఆడపిల్ల పుట్టిందని పండగ చేసుకున్న తండ్రి.. ఎక్కడో తెలుసా?
ఆడపిల్లలు పుడితే ఎంతగానో బాధపడేవారు ఇప్పటికీ వున్నారు. . ఈ రోజుల్లో ఆడపిల్లకు విలువ ఇవ్వడం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ తండ్రి చేసిన పనిని చూస్తే మాత్రం ఇలాంటి అదృష్టం ప్రతి ఆడపిల్లకు కావాలని కోరుకుంటాం. అమ్మాయి పుట్టిందని ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నాడు. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందంటూ ఊరంతా చీరలు పంచాడు ఓ తండ్రి.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరులో ఓగులపు అజయ్ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. తండ్రి అజయ్ మహాలక్ష్మి పుట్టిందని ఊరిలోఉన్న ప్రతి మహిళకు చీరల పంపిణీ చేశాడు. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందంటూ ఘనంగా సంబురాలు చేసుకున్నాడు.
అంతేకాదు 1500 చీరలను ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ చేశారు. ఇంటికి మహాలక్ష్మి వంచిందని సంతోషంగా చీరలను పంపిణీ చేసినట్లు అజయ్ తెలిపారు. అజయ్ బతుకుదెరువు కోసం దుబాయ్లో పని చేసేవాడు. అక్కడ ఉన్న సమయంలో రెండేళ్ల క్రితం రూ.30 కోట్ల లాటరీ తగిలి ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోయాడు.
ఇప్పుడు ఇంట్లో ఆడపిల్ల పుట్టడం ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. అందుకే ఇంటింటికీ ఉచితంగా చీరలు పంపిణీ చేశానని అజయ్ చెప్పుకోచ్చారు.